బాబు పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరు

జగ్గయ్యపేటః వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జగ్గయ్యపేట నియోజకవర్గ సమన్వయకర్త సామినేని ఉదయభాను ముక్త్యాల గ్రామంలో గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అన్ని అర్హతలున్నా పింఛన్ ఇవ్వడం లేదని పలువురు మహిళలు వాపోయారు. భూమి లేని గిరిజనులకు 2 ఎకరాల భూమి, గిరిజన యువతుల వివాహాలకు రూ.50 వేలు ఇస్తామని హామీ ఇచ్చి బాబు మోసం చేశారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. బాబు పాలనలో ఒక్కరు కూడా సంతోషంగా లేరని సామినేని ఉదయభాను అన్నారు. బాబు దగాకోరు పాలనను గడపగడపలో ఎండగట్టారు.


Back to Top