బాబు ప్రజలకు చేసిందేమీ లేదు

తూర్పుగోదావరి))గడపగడపకు వైయస్సార్‌సీపీ కార్యక్రమంలో భాగంగా ముమ్మడివరం నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ పితాని బాలకృష్ణ  అవంతపురం శివారు ప్రాంతాల్లో పర్యటించారు.  ప్రజలు తమ సమస్యలు ఏకరువు పెట్టారు. టీడీపీ అధికారంలోకి రాగానే తమ పింఛన్లు రద్దు చేశారని ., ఇంటి నిర్మాణాలు ఆగిపోయాయని ఆయన ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన ప్రజలకు కష్టాలు తప్పడం లేదని బాలకృష్ణ వాపోయారు. మోసకారి బాబుకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. 

విశాఖ వెస్ట్‌)) సంక్షేమ పథకాలను నీరుగారుస్తూ బడుగుల జీవితాలతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెలగాటమాడుతున్నారని వైయస్సార్‌సీపీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయ కర్త, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్‌ ఆరోపించారు. బాబు రెండేళ్ల పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆయన ఆరోపించారు. జీవీఎంసీ 41వ వార్డు పరిధి ఐటీఐ జంక్షన్‌ ప్రాంతం సిద్దార్ధనగర్‌లో మంగళవారం గడపగడపకు వైయస్సార్‌ కార్యక్రమం జరిగింది. ఎన్నికల సందర్భంగా టీడీపీ ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని, బాబు రెండళ్ల పాలనలో ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదని ఈ సందర్భంగా విజయప్రసాద్‌ పేర్కొన్నారు. Back to Top