టీడీపీ కి ఒక్క మార్కూ ప‌డ‌టం లేదు

అనంతపురం :  తెలుగుదేశం ప్ర‌భుత్వానికి ప్ర‌జ‌ల చేతుల్లో ఒక్క మార్కూ ప‌డ‌టం లేద‌ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం అనంతపురం నగరంలో చేపట్టిన ‘గడప గడపకూ వైఎస్సార్’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రజాబ్యాలెట్లు అందజేసి.. చంద్రబాబు ప్రభుత్వ పనితీరుపై మార్కులు వేయాలంటూ కోరారు. అనంతరం మీడియూతో మాట్లాడారు. టీడీపీ నేతలు ఐఏఎస్,  ఐపీఎస్ అధికారులను తమ పార్టీ కార్యకర్తలుగా మార్చుకుంటున్నారని,  వారు కూడా అలాగే ఉపయోగపడుతున్నారని విమర్శించారు. అవినీతి పంపకాలపై రాజకీయ నాయకుల మధ్య కలెక్టర్లు పంచాయితీ చేసిన వైనం తన రాజకీయ జీవితంలో ఇప్పుడు తప్ప ఎప్పుడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు.   కృష్ణా పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని రాయలసీమ నుంచి కృష్ణా నది పరీవాహక జిల్లాలకు వెళ్లేందుకు రవాణా సౌకర్యార్థం జాతీయ రోడ్ల మరమ్మతులకు కేంద్రం రూ.కోట్లు  మంజూరు చేస్తే వాటిని ముఠాగా ఏర్పడి దోచుకునేందుకు రంగం సిద్ధం చేశారని తెలిపారు..  
Back to Top