ఇళ్లు లేవు..రుణాల మాఫీ లేదు

తూర్పుగోదావరి))కిర్లంపూడి మండలం వేలంక గ్రామంలోవైయస్సార్సీపీ జగ్గంపేట కోఆర్డినేటర్ ముత్యాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం జరిగింది. రుణాలు మాఫీ చేస్తానని చెప్పి బాబు మోసం చేశారని మహిళలు ముత్యాల వద్ద వాపోయారు. ఇళ్లు కట్టిస్తానని చెప్పిన బాబు, అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లవుతున్నా ఒక్క ఇళ్లు మంజూరు చేయడం లేదని పలువురు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. మోసకారి బాబుకు రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ముత్యాల పిలుపునిచ్చారు.


Back to Top