చంద్రబాబుది నిరంకుశ పాలన

నెల్లూరు: నెల్లూరు నగరంలోని 9వ డివిజన్‌ బంగ్లాతోట, యలమలవారిదిన్నె ప్రాంతాల్లో ఆ డివిజన్‌ కార్పొరేటర్‌ దామవరపు రాజశేఖర్‌ ఆధ్వర్యంలో నెల్లూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ డిప్యూటీ మేయర్‌ ముక్కాల ద్వారకనాథ్‌తో కలిసి నెల్లూరు నగర శాసనసభ్యులు డా.పి. అనిల్‌కుమార్‌ యాదవ్‌ గడపగడపకు వైయస్‌ర్‌సీపీ కార్యక్రమంలో భాగంగా పర్యటించారు. ఈ సందర్భంగా అనిల్‌కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ నోట్ల రద్దు నిర్ణయంతో జనమంతా బ్యాంకుల చుట్టూ తిరుగుతూ నానా అవస్థలు పడుతున్నా చంద్రబాబుకు చీమ కుట్టినట్టు కూడా లేదన్నారు. ఒక రోజు నిర్ణయం మంచిదని మరో రోజు కడుపు రగిలిపోతోందని రోజుకొక ప్రకటనతో టైంపాస్‌ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులు బ్యాంకుల్లో పదివేలు తీసుకోవచ్చని చెప్పారని ప్రవైటు బ్యాంకుల్లో తప్ప ఎక్కడా నాలుగు వేలకు మించి ఇవ్వడం లేదన్నారు. ఆ నాలుగు వేలతో కుటుంబం ఎలా గడవాలని ప్రశ్నించారు. కానీ ఆయన సొంత ఛానళ్లలో 2వేల కోట్లు తెప్పించి బ్యాంకులకు పంపిణీ చేసినట్లు వార్తలు వండి వార్చడం హేయమన్నారు. చిన్న షాపుల్లో ఎక్కడా స్వైపింగ్‌ మిషన్లు లేవని పెన్షనర్లకు ప్రభుత్వం నేరుగా చేతికే డబ్బులు ఇచ్చేందుకు చొరవ చూపాలని సూచించారు. ^è ంద్రబాబు, నరేంద్రమోడీలు ప్రజల మీద కక్ష కట్టినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలు పట్టించుకోకుండా టీడీపీ నాయకులు జన చైతన్య యాత్రల పేరిట ప్రజలను మోసపుచ్చేందకు మరో కుట్రకు తెరతీశారని పేర్కొన్నారు. మోడీ నగదు రహిత కార్యక్రమానికి వేసిన ముగ్గురు ముఖ్యమంత్రుల కమిటీలో ఇప్పటికే ముగ్గురు వెనక్కి వెళ్లారని దీనిని బట్టి చూస్తే మోడీ నిర్ణయంపై అంతటా వ్యతిరేకత వ్యక్తమవుతుందన్నారు. చంద్రబాబు తీసుకునే నిర్ణయాలు కార్పొరేటర్‌ సంస్థలకే ఉపయోగ పడతాయని అన్నారు. వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలిసి ఎమ్మెల్యే నిధుల గురించి ప్రశ్నిస్తే ఇవ్వం.. ఎవరికీ చెప్పుకుంటారో చెప్పుకోండని చెప్పడం చంద్రబాబు నియంతృత్వ పాలనకు అద్దం పడుతోందని పేర్కొన్నారు. హెరిటేజ్‌ నెయ్యికి, పాలకు సుమారుగా 400 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని టీడీపీ ప్రభుత్వం ధారాదత్తం చేసిందని అన్నారు. కార్యక్రమంలో పంగాల శ్రీనివాసులురెడ్డి, తిప్పిరెడ్డి రఘురామిరెడ్డి, శ్రీనివాసులురెడ్డి, జానకిరామయ్య, వైవి రెడ్డి,, బాలు, వినోద్, దుర్గ, మ్రరి శ్రీధర్, బట్టా కోటేశ్వర్‌రావు, అరుణ్, పాకాల లక్ష్మీనారాయణ, అబ్దుల్‌ సలాం, పొడమేకల సురేష్, తంబి, విజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

Back to Top