నయవంచక హామీలతో నట్టేట ముంచిన బాబు

తాడికొండ: ఎన్నికల ముందు ముస్లింల అభ్యున్నతికి పాటు పడతానని చెప్పి నయవంచక హామీలు ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని పూర్తిగా విస్మరించి నట్టేట ముంచారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మైనారిటీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు షేక్‌ మహబూబ్‌ అన్నారు. బేజాత్పురం గ్రామంలో నిర్వహించిన గడపగడపకూ వైయస్‌ఆర్‌ కార్యక్రమానికి విచ్చేసిన అయన విలేకరులతో మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి 1475 కిలోమీటర్ల పాదయాత్రలో భాగంగా షోడా బండ్లు అరటికాయ బండ్లు, లారీ క్లీనర్లను చూసి చలించారన్నారు. ఇలాంటి వారికి అక్షరజ్ఞానం అందించి ఆర్థికాభివృద్ధి సాధించేలా వైయస్‌ఆర్‌ ముఖ్యమంత్రి కాగానే  ముస్లింలకు నాలుగు  శాతం రిజర్వేషన్లు కల్పించారన్నారు. ఆయన చలువతో నేడు తెలుగు రాష్ట్రాల్లో ముస్లింలు డాక్టర్లు, ఇంజినీర్లు, సివిల్‌ ఇంజినీర్లు అవుతున్నారని తెలిపారు. వైయస్‌ఆర్‌ రుణం తీర్చుకోలేనిదని చెప్పారు. వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా చేసుకుంటేనే ముస్లింలకు మేలు జరుగుతుందని చెప్పారు. 

Back to Top