నవరత్నాలు...ప్రజలకు వరాలు

నందివాడ:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాలు ప్రజ‌ల‌కు వరాలని పార్టీ మండ‌ల కన్వీనర్‌ పెయ్యల ఆదాం అన్నారు. బుధవారం మండలంలోని ఇలపర్రు, ఎల్‌ఎన్‌పురం, వెంకటరాఘవపురం, కుదరవల్లి గ్రామాల్లో వైయ‌స్ఆర్‌  కుటుంబం కార్యక్రమం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఆదాం మాట్లాడుతూ  దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి హ‌యాంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి జనరంజక పాలన అందించారన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలను వంచిస్తూ పాలన సాగిస్తున్నారని తెలిపారు. ఇంటింటికీ వెళ్లి 9121091210 ఫోన్‌ నంబర్‌కు మిస్డ్‌కాల్‌ చేయించడం ద్వారా చంద్రబాబు పాలనకు వ్యతిరేకంగా ఓటు వేసినట్లు అవుతుందన్నారు. వైస్ ఎంపీపీ దామోదరావు ఆధ్వర్యంలో ఇంటింటికీ వెళ్లి వైయ‌స్ఆర్‌ కుటుంబం, నవరత్నాలు పథకాలపై ప్రజలకు వివరించారు. కర పత్రాలు పంపిణీ చేశారు. బూత్‌కమిటీ కన్వీనర్లు చింతాడ ఓగేశ్వరావు, సువ్వారి నాగవెంకటసత్యనారాయణ, సకలబత్తిన దిలీప్, నున్న గణేష్, తమిరిశ ఎంపీటీసీ సభ్యురాలు గొర్ల రమాదేవి, నగుళ్ల సత్యనారాయణ, బండి సుబ్బారావు, శ్రీనివాసరెడ్డి, బోడుపల్లి రంగారావు, నాగయ్య, ఆనందరావు, జనార్దనరావు, పాండు, సీతయ్య, జగన్, మిల్కీ పాల్గొన్నారు. 
--------------------------- 
బూత్ క‌మిటీ స‌భ్యుల‌కు శిక్ష‌ణ‌
వత్సవాయి:   వైయ‌స్ఆర్‌సీపీ నియోజకవర్గ బూత్‌ కమిటీ సభ్యులకు శుక్ర‌వారం శిక్ష‌ణ ఇవ్వ‌నున్న‌ట్లు  వత్సవాయి, జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు మండలాల పార్టీ అధ్యక్షులు గాదెల రామారావు, చిలుకూరి శ్రీనివాసరావు, కంచేటి రమేష్ తెలిపారు. మక్కపేటలో బుధవారం మక్కపేట పార్టీ అధ్యక్షుడు కనగాల రమేష్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ మండలంలోని మక్కపేట గ్రామంలో ఎన్‌కేఆర్‌ కల్యాణమండపంలో మధ్యాహ్నం రెండు గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామినేని ఉదయభాను ముఖ్య అతిథిగా పాల్గొంటారని చెప్పారు. మూడు మండలాలకు చెందిన బూత్‌ కమిటీ కన్వీనర్లు, సభ్యులు, నాయకులు విధిగా పాల్గొనాలని సూచించారు.
----------------------------
వైయ‌స్ జగన్‌ పాలనతోనే రాజన్న రాజ్యం 
సత్తెనపల్లి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయ‌స్‌.జగన్‌మోహన్‌రెడ్డి పాలనలోనే రాష్ట్రంలో రాజన్న సంక్షేమ పాలన వస్తుందని వైయ‌స్ఆర్‌ మెమోరియల్‌ గజ్జల వైద్యశాల  డాక్టర్‌ గజ్జల నాగభూషణ్‌రెడ్డి అన్నారు. బుధవారం ఇంటింటికి వైయ‌స్ఆర్‌ కుటుంబం లో భాగంగా పట్టణంలోని తొమ్మిదో వార్డులోని ఎన్‌ఎస్‌పీ కాలనీలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా గత ఎన్నికల వాగ్ధానాల అమలులోని వైఫల్యాలను, టీడీపీ ప్రజా వ్యతిరేక విధానాలను ఆయన ఇంటింటికి వివరించారు. పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాల గురించి వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. టీడీపీ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని పచ్చ చొక్కా నాయకులకే పరిమితం చేసిందని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని వాగ్ధానాలు బుట్టదాఖలు చేసిందని, రైతు రుణమాఫీ పాక్షికంగా అమలు చేసి దగా చేస్తుందని విమర్శించారు. నిరుద్యోగ భృతి, బంగారు రుణాల మాఫీ, డ్వాక్రా రుణమాఫీ, వంటి వాగ్ధానాలను సైతం విస్మ రించిందన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం తెచ్చేందుకు కృషి చేయాలని వివరించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి గార్లపాటి ప్రభాకర్, 9వ వార్డు కౌన్సిలర్, మున్సిపల్‌ చీఫ్‌ విప్‌ బలిజేపల్లి సురేష్‌కుమార్, 8వ వార్డు కౌన్సిలర్‌ గుజ్జర్లపూడి కృపమ్మ, బూత్‌ కన్వినర్లు కొత్తపల్లి రవికుమార్, బంకా మధుబాబు, గుజ్జర్లపూడి నిరంజన్, వి.సుధీర్‌కుమార్, ప్రకాష్, పసల పవన్, జి. అనుదీప్, గద్దల రూపస్, గుజ్జర్లపూడి ఆనంద్, గడ్డం అశోక్, గుజ్జర్లపూడి కృపాదానం, గరికపాటి ఫెర్నాండేజ్‌లు పాల్గొన్నారు.
--------------------------
 నవరాత్నాల‌తో పేద‌ల జీవితాల్లో వెలుగులు  
 అచ్చంపేట:  వైయ‌స్ఆర్  కాంగ్రెస్‌పార్టీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహనరెడ్డి ప్రకటించిన నవరత్నాలు వంటి ప‌థ‌కాల‌తో పేద‌ల జీవితాల్లో వెలుగులు నింపుతాయ‌ని మాదిపాడు ఎంపీటీసీ తూమాటి సత్తయ్య అన్నారు. వైయ‌స్ఆర్‌ కుటుంబంలో సభ్యులుగా చేర్చుకునేందుకు పార్టీ చేపట్టిన కార్యక్రమంలో భాగంగా బుధవారం గ్రామపార్టీ నాయకులతో కలసి ఆయన ఇంటింటికి తిరిగారు. 60మందిని కొత్తగా సభ్యులుగా చేర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అలవికాని 600హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబులా కాకుండా జగన్‌మోహనరెడ్డి ఆచరణయోగ్యమైనవి, అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే రత్నాలలాంటి నవరాత్నాలను ప్రకటించడం సంతోషకరమన్నారు. ముఖ్యంగా రైతులకు ఖరీఫ్‌కు ముందుగానే విత్తనాలు, ఎరువులు కొనుగోలుకు యేడాదికి రూ.12500లు ఇస్తాననడిం చాలా ఉపయోగకరమన్నారు. విద్యార్థులకు తమ చదువులనుబట్టి నగదు ప్రోత్సహించడం వల్ల ఇప్పుడు మూతపడిన ప్రభుత్వ పాఠశాలలు మొత్తం తిరిగి తెరుచుకుంటాయని, మన పిల్లలు ఉన్నత చదువులు చుదువుకునే అవకాశం ఉంటుందన్నారు. 24లక్షల పక్కా గృహాలు నిర్మిస్తాననడం నిరుపేదలకు ఎంతో ఉపయోగకరమన్నారు. ఇలా 9 రకాల రత్నాలు అన్ని వర్గాలకు మేలుచేకూరేవని, వచ్చే ఎన్నికలలో జగన్‌మోహనరెడ్డిని సీయంని చేద్దామని, కావటిని ఎమ్మెల్యేని చేద్దామని ఇంటింటికి తిరిగి వైఎస్సార్‌ కుటుంబంలో చేరాల్సిందిగా గ్రామస్తులను కోరారు. ఆయన వెంట ఆర్‌యంపి వైద్యుడు షేక్‌ కరిముల్లా, గ్రామపార్టీ నేతలు మాదావెంకట్రావు, కంభాల ఏడుకొండలు, చిట్యాల దావీదు, మునగాల శేషగిరిరావు, మహేష్, నాని, బూసి తదితరులు పాల్గొన్నారు. 
---------------------
వైయ‌స్ఆర్ కుటుంబంలో చేరండి
పెడన:  ప్ర‌తి ఒక్క‌రు వైయ‌స్ఆర్ కుటుంబంలో చేరాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ  పెడన నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాంప్రసాద్ కోరారు. బుధవారం ఉదయం పార్టీ కార్యాలయంలో ఇంటింటికి వైయ‌స్ఆర్‌ కుటుంబం కార్యక్రమంపై పార్టీ నాయకులతో సమీక్షించారు. పూర్తిస్థాయిలో కిట్‌లు పంపిణి చేయడం జరిగిందని, వైయ‌స్‌ కుటుంబం గురించి తెలియజేయడంతో పాటు నవరత్నాలు గురించి ప్రతి ఇంటికి తెలియజేస్తూ కరపత్రాలను అందజేయాలన్నారు. ఆయా బూత్‌లు వారిగా నిర్వహిస్తున్న కార్యక్రమాలకు రాష్ట్ర, జిల్లా, నియోజయవర్గ స్థాయి ఆయా విభాగాలకు చెందిన  పార్టీ నాయకులు హాజరవుతారని, బూత్‌ కన్వీనర్లు నాయకులు వచ్చే వరకు వేచి ఉండకుండా ఇంటింటికి వైయ‌స్ఆర్‌  కుటుంబం కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. అక్టోబరు రెండో తేదీలోగా పూర్తి చేసి నివేదికలు పంపించాలని ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని పార్టీ బూత్‌ కన్వీనర్లు, కార్యవర్గ సభ్యులు నాలుగు మండలాల్లోను, పెడన పట్టణంలోను ప్రతి రోజు నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో పురపాలక సంఘ చైర్మన్‌ భండారు ఆనందప్రసాద్, పెడన మండల కన్వీనర్‌ దావు భైరవలింగం, వివిధ గ్రామాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.  
Back to Top