జనరంజక పథకాలు...నవరత్నాలు

మంత్రాలయం రూరల్‌: వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి రూపొందించిన నవరత్నాలు జనరంజకమని వాల్మీకి నాయకుడు వెంకట్రాముడు అన్నారు. గురువారం మండల పరిధిలోని వగరూరు గ్రామంలో వైయస్సార్‌ కుటుంబ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని 50 ఇళ్లకు వెళ్లి నవరత్నాల గురించి వివరించారు. స్థానిక ప్రజలు వారి సెల్‌ఫోన్‌ల నుంచి మిస్డ్‌ కాల్‌ ఇచ్చి స్వచ్ఛందంగా వైయస్సార్‌ కుటుంబంలో చేరారు. ఇళ్లకు స్లిక్కర్లు అతికించారు. నవరత్నాలపై మహిళల నుంచి మంచి స్పందన వస్తుందోన్నారు. కార్యక్రమంలో నాయకులు చిన్నరాముడు, రామాంజినేయులు, చిన్నోడు, వీరేష్, రాఘప్ప, హనుమంతు, మహిళ నాయకురాలు రాములమ్మ, మారెమ్మ, నరసమ్మ తదితరులు పాల్గొన్నారు.
Back to Top