పేదలకు భరోసా కల్పించేందుకే నవరత్నాలు

వెంకటగిరిః ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వంలో అర్హులైన పేదలకు సంక్షేమపథకాలు అందక తీవ్రస్ధాయిలో నష్టపోయిన పేదలకు  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ద్వారా భరోసా కల్పించేందుకే వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నవరత్నాలను ప్రకటించినట్లు  పార్టీ పట్టణ కన్వీనర్ గుమ్మళ్లపుఢిల్లీబాబు పేర్కొన్నారు. పట్టణంలోని 22వవార్డులో బుధవారం వైయ‌స్ఆర్ కుటుంబం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి పేదవారిని ఆధుకునే దిశగా  కృషి చేస్తుందని తెలిపారు. నవరత్నాల పథకాలను అమలుచేసే దిశగా వైయ‌స్ జ‌గ‌న్‌ పట్టుదలతో ఉన్నట్లు వివరించారు. పేదల జీవితాల్లో భరోసా కల్పించి పార్టీని బలోపేతం చేసే దిశగా ప్రతి కార్యకర్త సమిష్టిగా కృషిచేయాలని సూచించారు.  కార్యక్రమంలో  బూత్ కన్వీనర్ సీహెచ్ మునికృష్ణయ్య, నాగేశ్వరరావు, రామ్మోహన్, నాయకులు మల్లిరెడ్డి, గణేష్రెడ్డి, చిరంజీవి, మునెయ్య, శ్రీనివాసులు,సుబ్బరావు, టింకు, మున్నా, ఆదిల్, రబ్బానీ, విష్ణు, సాయితేజ, తదితరులు పాల్గొన్నారు.

................................................
పాతపాడులో వైయస్ఆర్ కుటుంబం
చేజర్ల: మండలంలోని పాతపాడు గ్రామంలో బుధవారం వైయస్ఆర్ సీపీ మండల కన్వీనర్ తూమాటి విజయభాస్కర్రెడ్డి, బూత్ కన్వీనర్ అల్లంపాటి చిరంజీవిరెడ్డి ఆధ్వర్యంలో వైయస్ఆర్ కుటుంబం కార్యక్రమాన్నినిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో పర్యటించిన పార్టీ నాయకులు సభ్యత్వాల నమోదు చేశారు. అనంతరం టీడీపీ మోసపూరిత హామీలను ప్రజలకు తెలియచేస్తూ నవరత్నాలను తెలియచేసే కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ సీపీ మండల కన్వీనర్ తూమాటి విజయభాస్కర్‌రెడ్డి, బూత్ కన్వీనర్ అల్లంపాటి చిరంజీవిరెడ్డి, వైయస్ఆర్ సీపీ నాయకులు ప్రేమ్కుమార్రెడ్డి, ధనుంజయరెడ్డి, భాస్కర్రెడ్డి, వెంకటసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


Back to Top