ప్రజాసంక్షేమం కోసమే నవరత్నాలు

పుల్లంపేట: ప్రజాసంక్షేమం కోసమే నవరత్నాలను వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టారని మండల కన్వీనర్‌ ముస్తాక్, ముద్దా బాబుల్‌రెడ్డిలు అన్నారు. బుధవారం మండలంలోని ఆర్‌.గొల్లపల్లి, పుల్లంపేట, దళాయిపల్లి తదితర గ్రామాల్లో వైయస్సార్‌కుటుంబం కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల గురించి ప్రజలకు వివరించారు. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే ప్రతిపేదవానికి లబ్దిచేకూరుతుందని అన్నారు. గతంలో వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి పార్టీలకు అతీతంగా ప్రతికుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందించారని అన్నారు. ఆయనబాటలోనే ఆయన కుమారుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా మాటకు కట్టుబడే వ్యక్తి అని వారు తెలిపారు. అనంతరం వారితో 91210 91210 నెంబర్‌కు మిస్స్‌డ్‌కాల్‌ ఇచ్చి సభ్యత్వం నమోదు చేయించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ రెడ్డయ్యరెడ్డి, సుదర్శన్‌రెడ్డి, సుబ్బారెడ్డి, కిరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
...........................
దువ్వూరులో వైయస్సార్‌ కుటుంబం
దువ్వూరు : మండల కేంద్రమైన దువ్వూరులోని క్రిస్టియన్‌ వాడలో బుధవారం బూత్‌ కమిటీ కన్వీనర్‌ జేష్ఠాది రఘు ఆధ్వర్యంలో వైయస్సార్‌ కుటుంబం కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఇంటి యజమానిని కలిసి వైయస్సార్‌సీపీ చేపట్టబోయే నవరత్నా పథకాలను, చంద్రబాబు వైఫల్యాలను వివరించారు. అనంతరం 20 కుటుంబాల వారిని వైయస్సార్‌ కుటుంబ సభ్యులుగా చేర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో డి.భరత్, రాజు, మధు తదితరులు పాల్గొన్నారు.
.............................................
నవరత్నాలు పేదల జీవితాలను మారుస్తాయి
రైల్వేకోడూరు అర్బన్‌: వైయస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్న పథకాలు ప్రతి పేదవాడి జీవితాన్ని మారుస్తాయని జడ్‌పీటీసీ మారెళ్ల రాజేశ్వరి, పట్టణ కన్వీనర్‌ సీహెచ్‌ రమేష్, నియోజకవర్గ అధికార ప్రతినిధి మండల నాగేంద్రలు బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా అందరూ పట్టణంలోని న్యూకృష్ణానగర్‌ తదితర ప్రాంతాల్లో వైయస్సార్‌ కుటుంబ కార్యక్రమాన్ని చేపట్టారు. తెలుగుదేశం పాలనలో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని ఏ లబ్దిపొందని కుటుంబాలు పెద్దఎత్తున వైయస్సార్‌కుటుంబంలో సభ్యులుగా చేరుతున్నారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీనాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


తాజా ఫోటోలు

Back to Top