`న‌వ‌ర‌త్నాలు` ప్ర‌తి కుటుంబానికి ఓ భ‌రోసా

* ఎక్కువ మందిని  వైయ‌స్ఆర్ కుటుంబంలో చేర్చుదాం
* గ్రామ స్థాయిలో పార్టీని బ‌లోపేతం చేద్దాం
* పార్టీ శ్రేణుల‌కు తూర్పుగోదావ‌రి జిల్లా అధ్య‌క్షుడు క‌న్న‌బాబు పిలుపు

అమ‌లాపురం (రాజ‌మండ్రి): ప‌్ర‌తి కుటుంబానికి `న‌వ‌ర‌త్నాలు` గురించి వివ‌రిస్తూనే వీలైనంత ఎక్కువ మందిని `వైయ‌స్ఆర్ కుటుంబం`లో చేర్చాల‌ని  పార్టీ శ్రేణుల‌కు జిల్లా అధ్య‌క్షుడు క‌న్న‌బాబు పిలుపు నిచ్చారు. అమ‌లాపురంలోని స్థానిక సూర్య‌న‌గ‌ర్‌లోని వాస‌ర్ల‌వెంక‌న్న క‌ళ్యాణ మండ‌లంలో బుధ‌వారం ఉద‌యం `న‌వ‌ర‌త్నాలు` స‌భ‌ను నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా క‌న్న‌బాబు మాట్లాడుతూ పేద కుటుంబం సైతం ఉన్నతంగా బతికేందుకు... పేద వారు సైతం ఆర్ధిక, ఆరోగ్య, విద్య వంటి విషయాల్లో నిశ్చింతగా ఉండేందుకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రూపొందించిన నవ రత్నాలతో చేకూరే లబ్ది భవిష్యత్‌లో ప్రతి కుటంబానికి ఓ భరోసా కానుందన్నారు.  కొబ్బరి తోటల మద్య ఉన్న కళ్యాణ మండపంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో సభ క్రమశిక్షణతో సాగింది. జిల్లా అధ్యక్షుడు కన్నబాబు మాట్లాడుతూ నవ రత్నాల ప్రయోజనాలను అంశాల వారీగా వివరణాత్మకంగా అవగాహన కల్పించారు.  గ‌తంలో దివంగ‌త మ‌హానేత డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి  ప్రవేశ పెట్టి అమలు చేసిన ప్రజా రంజక పథకాలే నవ రత్నాలుగా ఉన్నాయని... అయితే టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్‌మెంట్‌ వంటి పధకాలను నిర్వీర్యం చేసిన క్రమంలో మన పార్టీ అధినేత జగన్‌ వాటిని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు నవ రత్నాల్లో చేర్చారని గుర్తు చేశారు. నవ రత్నాలను క్షేత్ర స్థాయిలో ప్రతి కుటుంబంలోకి తీసుకునివెళ్లి ఆ కుటుంబాలను వైయ‌స్ఆర్‌ కుటుంబంలో చేర్చాలా పార్టీ నాయకులు, కార్యకర్తలు అంకిత భావంతో ముందడుగులు వేయాలని కన్నబాబు పిలుపునిచ్చారు. పినిపే విశ్వరూప్‌ మాట్లాడుతూ నియోజకవర్గంలో పార్టీకి సంబంధించి ఉన్న 2018 బూత్‌ కమిటీల సభ్యులే క్షేత్ర స్థాయిలో నవ రత్నాలను ఇంటింటా ప్రచారం చేయాలని... ఆ మహత్తర బాధ్యత మీ భుజాలపైనే ఉందని గుర్తు చేశారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ నంద్యాల, కాకినాడ ఎన్నికల ఫలితాల తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ విజయాలు తమ పోల్, పొలిటికల్‌ మేనేజ్‌మెంట్‌ల వల్లే సాధ్యమయ్యాయని అభివర్ణించుకుంటున్నారని చెప్పారు. పోల్‌ మేనేజ్‌మెంట్‌ అంటే ఓటర్లను ప్రలోభాల పెట్టడం... పొలిటికల్‌ మేనేజ్‌మెంట్‌ అంటే ఇతర పార్టీల్లోంచి ఎమ్మెల్యేను ప్రలాభోలతో లాక్కోవడం అని విమర్శించారు. పార్టీ సీజీసీ సభ్యులు కుడుపూడి చిట్టబ్బాయి, జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ నంద్యాల,కాకినాడ ఎన్నికల్లో అడ్డదారుల్లో విజయాన్ని తెచ్చుకున్న చంద్రబాబు, ఆయన కొలువులోని మంత్రులు ఓడిన వైయ‌స్ఆర్‌సీపీ గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. వైయ‌స్ఆర్‌ మృతి తర్వాత జగన్‌తో బయటకు వచ్చిన ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి మళ్లీ ఎన్నికలతో ప్రజా తీర్పునకు వెళ్లినప్పుడు టీడీపీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రాని విషయాన్ని చంద్రబాబు గుర్తుకు తెచ్చుకోవాలని చురకలు వేశారు. అప్పుడు మీకు డిపాజిట్లు రానంత మాత్రన మీ పార్టీని మూసి వేశారా..? అని ప్రశ్నించారు. అమలాపురం పార్లమెంట్‌ నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు వలవల బాబ్జి, అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు నర్సాపురం మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు కూడా సభలో మాట్లాడి నవ రత్నాల అమలైతే పేదల బతుకులు, జీవనంలో అనూహ్య మార్పులు వస్తాయని... అది జగన్‌తోనే సాధ్యమని స్పష్టం చేశారు. 

తాజా ఫోటోలు

Back to Top