ఇంటింటికీ నవరత్నాలు రానున్నాయి

నాయకుడి ఒక్కమాట ప్రజలకు వేయి ఏనుగుల బలం. 
నాయకుడి ఒక్క పిలుపు లక్ష గొంతుల నినాదం.
నాయకుడి ఒక్క లక్ష్యం కోట్లాదిమంది ప్రజల సంక్షేమం.
అలాంటి ఒక నాయకుడు ఒక మాటన్నాడు. ‘ఈ రాష్ట్ర ప్రజలందరూ వైయస్సార్ నాకందించిన కుటుంబం’ అని. 
అది ఓ రాజకీయవాది నాలిక చివరినుంచి అన్నమాట కాదు. 
ఒక జన నేత మనఃస్ఫూర్తిగా అన్నమాట. 
అన్నా జగనన్నా అని ఆర్తిగా పిలుస్తున్న కోట్లాది మంది హృదయాలను గెలిచిన యువనేత అన్నమాట. 
మాట తప్పని, మడమ తిప్పని వైయస్సార్ వారసత్వం అన్నమాట. 
ఆ మాట నిజమని నిరూపిస్తూ నేడు వైయస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ‘వైయస్ ఆర్ కుటుంబం ’ కార్యక్రమాన్ని పులివెందులలో మొదలు పెట్టారు. 
వైయస్ ను అభిమానించేవారు, వైయస్ఆర్ కుటుంబాన్ని ప్రేమించేవారు, వైయస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వాన్ని కోరుకునేవారూ, ఒక్కమాటలో చెప్పాలంటే సంక్షేమాన్ని ఆశించే తెలుగు వారందరూ వైయస్సార్ కుటుంబ సభ్యులే. వారందరికీ నవరత్నాల గురించి వివరించేందుకు, రాజన్న రాజ్యాన్ని అందిస్తానని హామీ ఇచ్చేందుకు వైయస్సార్ కుటుంబాన్ని పార్టీలో భాగస్వాములను చేసేందుకు బహుముఖ కార్యాచరణకు పూనుకున్నారు వైయస్ జగన్. 
జగమంత కుటుంబానికి జగన్ మోహన్ రెడ్డి అందిస్తున్న కానుకే నవరత్నాలు. 

రైతులకు వైయస్సార్ భరోసా పేరిట ఏటా 50 వేలరూపాయలు 
డ్వాక్రా మహిళలకు అండగా వైయస్సార్ ఆసరా పథకం
వృద్ధులకు నెలకు రూ.2000 రూపాయల పెన్షన్
జలయజ్ఞంలోని ప్రాజెక్టులన్నీ పూర్తి చేయడం
ఆరోగ్యశ్రీని మళ్లీ గాడిలో పెట్టడం
దశలవారీ మధ్యనిషేధం 
ఫీజు రీఎంబర్స్మెంట్
ప్రతి ఒక్కిరికి విద్యను అందించేలా అమ్మ ఒడి పథకం
నిరుపేదలకు 25 లక్షల ఇళ్లు నిర్మించడం....
గడపగడపలో వైయస్సార్ ఫొటో ఉంది. గుండె గుండెలో వైయస్ఆర్ స్ఫూర్తి ఉంది. ఆ ఆదరణకు ఆ అభిమానానికి దాసోహం అంటుంది వైయస్సార్ కుటుంబం. అందుకే రక్తం పంచుకున్న వారేకాదు, ప్రేమను పంచి ఇచ్చిన రాష్ట్రప్రజలంతా మా కుటుంబ సభ్యులే అన్నారు వైయస్ జగన్. నీ నా అనే బేధం లేకుండా అందరికీ ప్రయోజనాలందిచే లక్ష్యంతో ఈ నవరత్నాలు ఇంటింటికీ అందిస్తామని చెబుతున్నారు. వైయస్సార్ ను గుర్తుకు తెచ్చేలా రేపటి ప్రభుత్వం ఉంటుందని చెప్పే వైయస్ జగన్ మాటల్లో భవిష్యత్ పై అంతులేని ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. రాజన్న రాజ్యం రావడం తధ్యం అనిపిస్తుంది. 

తాజా ఫోటోలు

Back to Top