ఇంటింటికీ నవరత్నాలు

నాతవరం: మారుమూల గ్రామాల సైతం నవరత్నాలు గురించి ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు పూర్తి స్ధాయిలో బూత్‌ కమిటి సభ్యులు అవగాహన కల్పించాలని వైయ‌స్ఆర్‌సీపీ నర్సీపట్నం నియోజకవర్గం కన్వీనర్‌ పెట్ల ఉమా శంకర్‌ గణేష్‌ అన్నారు. ఆయన మండలంలో శుక్రవారం పి,జగ్గంపేట పి,కె,గూడెం, గునుపూడి, పెదగొలుగోండపేట గ్రామాల్లో పర్యటించారు. పి,జగ్గంపేట గ్రామంలో ఇంటింటికి నవరత్నాలపై వివరించారు ,తర్వాత చంద్రబాబునాయుడు ఎన్నికలు ముందు ఇచ్చిన హమీలను ఏవిధంగా అమలు చేయుకుండా ప్రలజను మోసం చేసాడన్న విషయాలను గుర్తు చే సారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పట్నుంచే ప్రతి కార్యకర్త కూడా సైనికులా పని చేయాలన్నారు. ప్రతి ఇంటికి వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సిఎం అయితే నవరత్నాలు ద్వారా ప్రజలను ఏవిధంగా మేలు చేస్తారన్న విషయాలను తెలియుజేయాలన్నారు. అలాగే ఉత్సహం ఉన్న వారికి వైయస్‌ కుటుంబ సభ్యులుగా చేరడానికి మిస్స్‌డ్‌ కాల్‌ ద్వారా చే ర్పించాలన్నారు. చంద్రబాబునాయుడు డ్వాక్రా సభ్యులను యువకులను రైతులను విద్యార్ధులను అన్ని విధాలుగా మోసం చేసాడని మరల మోçసం చేయడానికి జిమ్మిక్కులు చేస్తున్నాడన్నారు. ఈవిషయంలో ప్రజలు మరల మోసం పోకుండా జాగ్రత్త పడాలన్నారు. రాజన్న రాజ్యం రావాలంటే వైయస్‌ జగన్మోహన్‌రెడ్డిని సిఎం చేయాలన్నారు. గ్రామాల్లో నాయుకులు కార్యకర్తలు ఐక్యతగా పార్టీని మరింత అబివృద్ది చేయాలన్నారు. ఈకార్యక్రమంలోవైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యనిర్వహక కమిటి సభ్యులు అంకంరెడ్డి జమీలు జిల్లా కమిటి సభ్యులు శెట్టి నూకరాజు, పైల పోతురాజు, సబ్బవరపు వెంకునాయుడు, పైల సునీల్, శిరుసుపల్లి శేఖర్, గోంప జమీలు అంకంరెడ్డి నానిబాబు గుడపర్తి నాగేశ్వరావు,మిరపల వెంకటరమణ, వేమల సూరిబాబు, బండారు పైడన్ననాయుడు. లగుడు నానిబాబు గోర్లె వరహలబాబు,తమరాన రాము, కాళ్ల సత్యనారాయణ, కాళ్ల నాగబాబు కార్యకర్తలు నాయుకులు పాల్గోన్నారు.   
----------------------------
నవరత్నాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి 
మునగపాక: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జగన్‌మోహనరెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం అందరిపైనా ఉందని పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్‌ పిలుపునిచ్చారు.స్థానిక పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మండల కార్యకర్తల సమావేశంలో ప్రసాద్‌ మాట్లాడారు. గ్రామాల్లో వైయ‌స్ఆర్‌ కుటుంబ కార్యక్రమం మందకొడిగా సాగుతుందన్నారు. అక్టోబర్‌ 2లోగా ప్రతీ గ్రామంలో ఇంటింటికీ వెళ్లి పార్టీ సభ్యత్వాలు అందించాలన్నారు. ప్రధానంగా 9121091210 ఫోన్‌నెంబరుకు ప్రతీ ఇంటినుంచి మిస్డ్‌కాల్‌ ఇప్పించేలా కృషి చేయాలన్నారు. అలాగే ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రజా సమస్యలపై రానున్న రోజుల్లో రాజీలేని పోరుకు సిద్దంకావాలన్నారు. రానున్న 2019 ఎన్నికలను సవాల్‌గా తీసుకొని ప్రతీ కార్యకర్త పార్టీకోసం కష్టపడి పనిచేయాలన్నారు. వైఎస్‌ ఆశయాలు అమలుకావాలంటే జగన్‌మోహనరెడ్డి సీఎం కావడం ఒక్కటే మార్గమన్నారు.సమావేశంలో అచ్చుతాపురం మండల పార్టీ కన్వీనర్‌ మారిశెట్టి సూర్యనారాయణ మాట్లాడుతూ ప్రతీ కార్యకర్త సైనికుల్లా పనిచేసి వైయ‌స్ఆర్‌ కుటుంబ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శులు దాసరి అప్పారావు, మొల్లేటి శంకర్, వైస్‌ ఎంపీపీ కాండ్రేగుల నూకరాజు,యువజన విభాగం అధ్యక్షులు సూర్యనారాయణ,ఎంపీటీసీలు పెంటకోట అప్పలనాయుడు,పల్లెల ప్రకాశరావు,పార్టీ నేతలు దొడ్డి బాలాజీ, కోటేశ్వరరావు,బొడ్డేడ శ్రీనివాసరావు,శరగడం జగన్నాధరావు, ధనశ్రీను, పొలమరశెట్టి జగ్గారావు,నాయుడు అప్పలనాయుడు,రాజాన బుజ్జి, జోగినాయుడు, పెంటకోట హరేరామ, చదరం నాయుడు, అప్పలనాయుడు, గుంట్ల అప్పారావు, భీశెట్టి గంగప్పలనాయుడు,అల్లవరపు రమణబాబు, జాజుల వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.

 -------------------------------

నవరత్నాలతో అన్ని వర్గాలకు మేలు 
బూరుగుపాలెం(మాకవరపాలెం): వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్న పథకాలు అన్ని వర్గాలవారికి మేలు చేకూర్చుతాయని  పార్టీ మండల అధ్యక్షుడు ఆర్‌.సత్యన్నారాయణ అన్నారు. వైయ‌స్ఆర్  కుటుంబ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం బూరుగుపాలెంలో ఇంటింటి ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా బూత్‌ కమిటీ కన్వీనర్లు నవరత్నాలపై ప్రచారం చేయడంతోపాటు వైయ‌స్ఆర్‌ కుటుంబంలో చేర్పించేందుకు ప్రజల నుంచి 9121091210 నంబర్‌కు ఫోన్‌లు చేయించారు. దీనికి ప్రజల నుంచి మంచి స్పంధన లభిస్తోంది. ఈ సందర్భంగా సత్యన్నారాయణ మాట్లాడుతూ ప్రజలంతా వైయ‌స్ఆర్‌సీపీని ఆదరించాలని కోరారు. దివంగత నేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి పాలన వైయ‌స్ జగన్‌తోనే సాధ్యమన్నారు. 
Back to Top