నవరత్నాలతో ప్రజలకు ఎంతో మేలు

మండవల్లి : గడప గడపకూ వైయస్సార్‌ కుటుంబం కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలో పార్టీ మండల అధ్యక్షుడు గుమ్మడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నవరత్నాలు, ప్రజాబ్యాలెట్‌ కరపత్రాలను మంగళవారం పంపిణీ చేశారు. ప్రతి ఇంటి నుంచి 9121091210 నంబర్‌కు వారి ఫోన్‌ నుంచి మిస్డ్‌కాల్‌ చేశారు. ఇంటి తలుపులకు స్టిక్కర్‌లు అంటించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్‌) మాట్లాడుతూ ప్లీనరీలో అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాల పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందని చెప్పారు. వైయస్‌ జగన్‌ ప్రభుత్వం రాగానే ప్రతి పథకాన్నీ పక్కాగా అమలు చేస్తారని తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శి చేబోయిన వీర్రాజు, జిల్లా కార్యదర్శి పరింకాయల వెంకటేశ్వరరావు, వైయస్‌ ఎంపీపీ యార్లగడ్డ సత్యనారాయణ, జిల్లా రైతు విభాగం కార్యదర్శి బోనం శేషగిరి, జిల్లా ట్రేడ్‌ యూనియన్‌ అచ్చుత శివబాబు, మండల రైతు విభాగం అధ్యక్షుడు గుడివాడ బాలాజి, మండల మహిళా అధ్యక్షురాలు వెలగపల్లి బేబీసరోజిని, పార్టీ నాయకులు చేబోయిన వెంకట్, బొమ్మనబోయిన రాజేష్, బూత్‌ కన్వీనర్లు వట్టిప్రోలు ఆనందదాసు, పోలగాని ఉదయ్‌కిరణ్, పసుపులేటి నాంచారయ్య, ఆటో రాజు గ్రామ కమిటీ, బూత్‌ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top