పేద ప్ర‌జ‌ల సంక్షేమం కోస‌మే న‌వ‌ర‌త్నాలు

కొత్త‌పేటః  వైయస్సార్‌ కుటుంబం,నవరత్నాల ప్రచారంలో భాగంగా కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి వంసతవాడలో ఇంటింటా పర్యటించారు.   పేద ప్ర‌జ‌ల సంక్షేమం కోస‌మే వైయస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి న‌వ‌ర‌త్నాలు ప్రకటించారని అన్నారు. ప్రజా సంక్షేమ‌మే వైయస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ధ్యేయ‌మ‌ని ఆయ‌న పేర్కొన్నారు.  వసంతవాడ గ్రామంలో శుక్రవారం జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో గ్రామ ఇంచార్జ్ , ర్యాలి రూరల్‌ బ్యాంక్‌ అధ్యక్షుడు పేర్చేర్ల పుల్లంరాజు అధ్యక్షతన వైయస్సార్‌ కుటుంబం మ‌రియు ఇంటింటా నవరత్నాల ప్రచారం కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్ళి ఆ కుటుంబ సభ్యులచే మిస్డ్‌ కాల్‌ ద్వారా వైయస్సార్‌ కుటుంబంలో చేర్చారు. జగన్‌ ప్రకటించిన నవరత్న పథకాల కరపత్రాన్ని అందించి ఆయా పథకాలపై ప్ర‌జ‌ల్లో  అవగాహన కల్పించారు. రానున్న రోజుల్లో నవరత్నాలు ఈ రాష్ట్రానికి వైయస్సార్‌ స్వర్ణయుగాన్ని తీసుకురానున్నాయని ఆయ‌న  అన్నారు. అనంతరం స్దానిక విలేకర్లతో మాట్లాడుతూ... దివంగత వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టడం జ‌రిగింద‌ని అన్నారు. ఎన్నికల ముందు  హామీలను గుప్పించి అధికారం చేజిక్కించుకున్న తెలుగుదేశం పార్టీ పాలనలో సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందించడం లేదన్నారు.  జగన్‌మోహన్‌రెడ్డి ప్రతి పేదవాడికి నవరత్నాలు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఏ విధమైన రుసుము లేకుండా పార్టూ సభ్యత్వం నమోదు చేయించుకుని మిస్డ్‌కాల్‌ చేస్తే స్వయంగా జగన్‌ అన్న మీతో మాట్లాడతారని ఆయన వివరించారు. ప్రతి పేదవాడకి నవరత్నాలు అందించే విధంగా నమోదు ప్రక్రియ జరుగుతుందన్నారు. అధికారంలోకి రాగానే ఆ పనులు చేయ‌డానికి  చర్యలు చేపడతామన్నారు. రైతులు , డ్వాక్రా, పీజు రియింబర్స్‌మెంట్, పించన్లు, అమ్మబడి ,ఆరోగ్యశ్రీ, గృహనిర్మాణాలు, ప్రాజెక్టులు తదితర పనులు సత్వరమే న‌వ‌ర‌త్నాల‌తో  అందించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వాటి ఫలాలను పేదలకు అందిస్తామని ఆయన వివరించారు. అలాగే కార్యకర్తలను సంక్షేమ పథకాలతో ప్రలోభపెట్టి పార్టి పిరాయింపులకు పాల్పడుతున్నారని తెలుగుదేశం పార్టీ నేతలపై ఆయన మండిపడ్డారు. 
...................................
న‌వ‌ర‌త్నాల‌తో ప్ర‌జ‌ల‌కు మంచిరోజులు
మామిడికుదురుః నవ్యాంధ్రకు నవరత్నాల ద్వారా ప్రజలకు మంచి రోజులు రాబోతున్నాయని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పేర్కొన్నారు. వైయస్సార్‌ కుటుంబం కార్యక్రమం శుక్రవారం ఈదరాడ, మగటపల్లి గ్రామాల్లో జరిగింది.  పార్టీ నాయ‌కులు ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వైయస్సార్‌ కుటుంబంలో పలువురిని సభ్యులుగా చేర్పించారు. టీడీపీ హయాంలో ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను వివరించారు. వైయస్సార్‌ సీపీ ప్లీనరీలో ప్రవేశపెట్టిన నవరత్నాల ద్వారా కలిగే ప్రయోజనాలను ప్ర‌జ‌ల‌కు  వివరించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు మ‌ళ్ళీ  అమలు కావాలంటే జగనన్న రాజ్యం రావాలని ఆకాంక్షించారు. ఆయా కార్యక్రమాల్లో పార్టీ మండల, గ్రామ శాఖ అధ్యక్షులు యెరుబండి చిట్టికాపు, వడ్డే ఆదిబాబు, కుసుమ పెరుమాళ్లకుమార్, యెరుబండి సత్తిబాబు, తోట త్రిమూర్తులు, యెరుబండి సూర్యనారాయణ, యెరుబండి సూర్యారావు, యెరుబండి నాగరాజు, యెరుబండి తాతాజీ, బొంతు సుధాకర్, కలిగితి రామకృష్ణ, వర్ధనపు బుజ్జి, బండారు జగన్, ఇందుర్తి వెంకటేశ్వరరావు, ఉండపల్లి శివ, కలిగితి పెద్దిరాజు, బొడ్డపల్లి వీరాస్వామి, కుప్పాల ప్రసాద్, ముసూడి శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.
................................................
న‌వ‌ర‌త్నాల‌తో ప్ర‌జా సంక్షేమం
అనపర్తి: వైయస్సార్‌ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి రూపొందించిన నవరత్నాల పథకాలతోనే రాష్ట్ర ప్రజల సంక్షేమం ముడిపడి ఉందని ఆ పార్టీ మండల కన్వీనర్‌ మల్లిడి ఆదినారాయణరెడ్డి తెలిపారు. వైయస్సార్‌ కుటుంబం కార్యక్రమంలో భాగంగా స్థానిక మార్కండేయపురం 7వ పోలింగ్‌ బూత్‌ పరిధిలో పార్టీ శ్రేణులతో కలసి ఆయన ఇంటింటికీ వెళ్లారు. వైయస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్ర‌వేశ‌పెట్టిన న‌వ‌ర‌త్నాల  పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. పలు కుటుంబాలతో  పార్టీ కార్యాలయానికి మిస్డ్‌కాల్‌ ఇప్పించడం ద్వారా వైయస్సార్‌ కుటుంబంలో చేర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..... మూడున్నరేళ్ళుగా తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజలు గ్ర‌హిస్తున్నారు అని ఆయ‌న అన్నారు. ఎన్నికల హామీలను గాలికి వదలి ప్రజలను ఇబ్బందుకు గురిచేస్తున్న నేటి రాష్ట్ర  ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పారు. ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పాటుపడే వైయస్సార్‌ సీపీకి మద్దతు తెలపాలని, వచ్చే ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని  గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బూత్‌ కన్వీనర్‌ మల్లిడి వెంకటరెడ్డి, టి.దుర్గాప్రసాద్, కె.ఉదయ్‌భాస్కర్‌రెడ్డి, తాడి శ్రీనివాసరెడ్డి, గంగాధర్, శ్రీకాంత్, విజయ్, శ్రీను, మ‌ణికంఠ‌రెడ్డి, వెంకన్న, రమణ, పి.శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మండలంలోని దుప్పలపూడి, రామవరం, కుతుకులూరు, కొప్పవరం, పొలమూరు, లక్ష్మీనరసాపురం గ్రామాల్లో వైఎస్సార్‌ కుటుంబం కార్యక్రమం నిర్వహించారు.

తాజా ఫోటోలు

Back to Top