ప్రతి ఒక్కరిని వైయ‌స్‌ఆర్‌ కుటుంబంలో చేర్పిదాం

శ్రీ‌శైలం:

 వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రకటించిన నవరత్నాలు పథకాలతో ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతాయని పార్టీ శ్రీశైలం నియోజకవర్గ సమన్వయకర్త బుడ్డా శేషారెడ్డి అన్నారు. నవ రత్నాల పథకాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లేందుకు శుక్రవారం వేల్పనూరులోని శేషారెడ్డి స్వగృహంలో శ్రీశైలం నియోజకవర్గంలోని అన్ని మండలాల బూత్‌ కన్వీనర్లకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా  బుడ్డా శేషారెడ్డి మాట్లాడుతూ.. నీరు–చెట్టూ, పుష్కర పనుల పేరుతో టీడీపీ నేతలు దోచుకున్నారని ఆరోపించారు. పింఛన్లు, రేషన్‌ కార్డుల కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులు ఎవరి పేరు చెబితే వారికే సంక్షేమ పథకాలు మంజూరు చేస్తున్నారని ధ్వజమెత్తారు. నంద్యాల ఉప ఎన్నికలో అధికార పార్టీ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి, డబ్బులతో ప్రలోభపెట్టి గెలిచిందని, ఆ గెలుపు గెలుపే కాదనన్నారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు పార్టీ తగిన గుణపాఠం చెప్పే విధంగా కార్యకర్తలు, నాయకులు పనిచేయాలన్నారు. మళ్లీ మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాలన వస్తుందని, జగనన్న ముఖ్యమంత్రి అవుతున్నారని, మంచి రోజులు వస్తున్నాయ‌న్నారు. వైయ‌స్‌ఆర్‌సీపీ కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో 91210 91210 నంబరుకు మిస్‌డ్‌ కాల్‌ ఇప్పించాలని బుడ్డా శేషారెడ్డి సూచించారు.  కార్య‌క్ర‌మంలో పార్టీ మండ‌ల క‌న్వీన‌ర్లు, బూత్ క‌న్వీన‌ర్లు పాల్గొన్నారు. 

తాజా ఫోటోలు

Back to Top