న‌వ‌ర‌త్నాలుతోనే రాజ‌న్న రాజ్యం

పామ‌ర్రు (కృష్ణా):

 వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌క‌టించిన `న‌వ ర‌త్నాలు`ను ప్ర‌తి కార్య‌క‌ర్త ఇంటింటికీ తీసుకెళ్లి వాటి గురించి వివ‌రించాల‌ని, న‌వ‌ర‌త్నాలుతోనే రాజ‌న్న రాజ్యం సాధ్య‌మ‌ని  స‌భ‌కు హాజ‌రైన కార్య‌క‌ర్త‌ల‌నుద్దేశించి కృష్ణా జిల్లా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ  అధ్య‌క్షులు కొలుసు పార్థ సార‌ధి అన్నారు. ఈ సంద‌ర్భంగా పామ‌ర్రు నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త కైలే అనిల్ కుమార్ మాట్లాడుతూ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావ‌డ‌మే ధ్యేయ‌మ‌ని, అప్ప‌టి వ‌ర‌కు సైనికుడిలా పోరాటం చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. కార్య‌క్ర‌మంలో గుంటూరు న‌గ‌ర అధ్య‌క్షులు లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే ర‌క్ష‌ణ నిధి, అవ‌నిగ‌డ్డ స‌మ‌న్వ‌య‌క‌ర్త సింహాద్రి ర‌మేష్‌, పెడ‌న స‌మ‌న్వ‌య‌క‌ర్త ఉప్పాల రాంప్ర‌సాద్‌, మ‌చిలీప‌ట్నం స‌మ‌న్వ‌క‌ర్త పేర్ని నాని, జ‌ట్పీటీసీలు, ఎంపీటీసీలు త‌దిత‌రులు పాల్గొన్నారు. 

తాజా ఫోటోలు

Back to Top