నవరత్నాలతో ప్రతి కుటుంబానికి లబ్ధి

సింహాద్రిపురం:

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రవేశ పెట్టిన నవరత్నాలతో ప్రతి కుటుంబానికి ఎంతో లబ్ధి చేకురుతుందని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి వైయ‌స్‌ భాస్కరరెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని సుంకేసుల గ్రామంలో వైయ‌స్‌ఆర్‌ కుటుంబం కార్యక్రమం నిర్వహించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలను తెలుసుకోవడమే వైయ‌స్‌ఆర్‌ కుటుంబం ముఖ్య ఉద్దేశ్యమన్నారు. ఆయన ఇంటింటికి వెళ్లి వైయ‌స్‌ జగన్‌ ప్రకటించిన నవరత్నాల పధకాలను వివరించి ప్రజలను వైయ‌స్‌ఆర్‌ కుటుంబంలో సభ్యులుగా చేర్పించారు. కార్యక్రమంలో వైయ‌స్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, జిల్లా పార్టీ అధికార ప్రతినిధి పరమేశ్వరరెడ్డి, నాయకులు జగదీశ్వరరెడ్డి, రామకోటిరెడ్డి, మధు, శేఖరరెడ్డి, మౌళి, నారాయణరెడ్డి, సోమశేఖరరెడ్డి, శివశంకర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Back to Top