నంద్యాల సీటు వైయ‌స్ఆర్ సీపీదే

క‌ర్నూలు: న‌ంద్యాల ఉప ఎన్నిక‌ల్లో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీదే విజ‌య‌మ‌ని పార్టీ క‌ర్నూలు ప‌ట్టణ ఇన్‌చార్జ్ హ‌ఫీజ్‌ఖాన్ అన్నారు. క‌ర్నూలు 10వ వార్డులో హ‌ఫీజ్ ఖాన్ ఆధ్వ‌ర్యంలో గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ప్ర‌క‌టించిన న‌వ‌ర‌త్నాల‌ను వివ‌రించారు. మూడేళ్ల కాలంగా చంద్ర‌బాబు అబ‌ద్ధాలు, అరాచ‌కాల‌తో పాల‌న సాగిస్తున్నాడ‌ని మండిప‌డ్డారు. నంద్యాల‌లో ఉప ఎన్నిక‌లు రాగానే అభివృద్ధి అంటూ కొత్త రాగం పాడుతున్నాడ‌ని ఎద్దేవా చేశారు. చంద్ర‌బాబు ఎన్ని కుయుక్తులు ప‌న్నినా నంద్యాల సీటు వైయ‌స్ఆర్ సీపీదేన‌ని ధీమా వ్య‌క్తం చేశారు.  2019 ఎన్నిక‌ల్లో వైయ‌స్ఆర్ సీపీని గెలిపించి టీడీపీని రాష్ట్రం నుంచి త‌రిమికొట్టాల‌న్నారు. కార్య‌క్ర‌మంలో వైయ‌స్ఆర్ సీపీ నేత‌లు సురేంద‌ర్‌రెడ్డి, నాగ‌రాజు యాద‌వ్‌, సురేష్‌, ధ‌నుంజ‌యాచారి, రాజ‌శేఖ‌ర్‌, దండె సుధాక‌ర్‌, న‌వీన్ త‌దిత‌రులు పాల్గొన్నారు. 

Back to Top