నవరత్నాల సభకు తరలిరండి

సత్తెనపల్లి: వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వై.యస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అన్ని వర్గాల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ప్లీనరీలో ప్రకటించిన నవరత్నాల పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకు.... శుక్రవారం ఉదయం 10 గంటలకు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌ ఎదుట గల గో సంరక్షణ శాల కల్యాణ మండపంలో వైయస్సార్‌ సీపీ పట్టణ విస్తృత స్థాయి సమావేశం (నవరత్నాలసభ) జరుగుతుందని పార్టీ పట్టణ అధ్యక్షుడు షేక్‌ నాగూర్‌ మీరాన్‌ తెలిపారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సమావేశానికి పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, వినుకొండ, గురజాల, పెదకూరపాడు, నియోజకవర్గాల సమన్వయ కర్తలు బొల్లా బ్రహ్మనాయుడు, కాసు మహేష్‌రెడ్డి, కావటి మనోహర్‌నాయుడులతోపాటు పలువురు ముఖ్య నాయకులు హాజరవుతారన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ విభాగాల నాయకులు, బూత్‌ కమిటీ కన్వీనర్లు, సభ్యులు, అభిమానులు హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

Back to Top