నవరత్నాల సభకు తరలిరావాలి

– లీలాకృష్ణ పిలుపు
-మండపేట సూర్యకనెన్షన్‌ హాలులో 6న సభ
మండపేట : పేదల సంక్షేమమే ధ్యేయంగా వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాలు పథకంపై ఈనెల 6న మండపేటలో జరిగే సమావేశానికి నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్‌ వేగుళ్ల లీలాకృష్ణ కోరారు. స్థానిక పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో బుధవారం ఉదయం 10 గంటలకు స్థానిక బస్టాండు వద్ద గల సూర్య కన్వెన్షన్‌ హాలులో సమావేశం ప్రారంభవుతుందన్నారు. మహిళలు, రైతులు, విద్యార్థులు తదితర అన్ని వర్గాల వారికి మేలు జరిగేలా, వారి కష్టాలు తీరేలా జగన్‌మోహన్‌రెడ్డి నవరత్న పథకాలను రూపొందించారని లీలాకృష్ణ పేర్కొన్నారు. వైయస్సార్‌ రైతు భరోసా, వైయస్సార్‌ ఆసరా, ఫించన్లు రూ. రెండు వేలకు పెంపు, అమ్మ ఒడి, పేదలందరికి ఇళ్లు, ఆరోగ్యశ్రీకి పూర్వవైభవం, ఫీజు రీయింబర్స్‌మెంట్, జలయజ్ఞం, దశలవారీ మద్యం నిషేదంలు రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలోకి నడిపించనున్నాయన్నారు. అన్న వస్తున్నాడన్న నినాదాన్ని పేదవర్గాల వారు స్వాగతిస్తుండటం టీడీపీ నేతలను ఆందోళనకు గురిచేస్తోందన్నారు. నవరత్నాల సభకు నియోజకవర్గం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి సభను విజయతంవం చేయాలని లీలాకృష్ణ కోరారు.
Back to Top