వ్యాధిగ్రస్తులను ఏడిపించడం తగునా

రైల్వేకోడూరు: వ్యాధిగ్రస్తులను ఏడిపించడం ప్రభుత్వానికి, అధికారులకు తగునా అని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ప్రశ్నించారు. మండలంలోని జ్యోతి కాలనీలో ఎమ్మెల్యే గడప గడపకు వైయస్‌ఆర్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో ప్రతి గడపకు తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. వైయస్‌ఆర్‌సీపీ ముద్రించిన ప్రజాబ్యాలెట్లను పంపిణీ చేసి చంద్రబాబు పాలనపై మార్కులు వేయించారు. ఈ సందర్భంగా  కొరముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ..వ్యక్తిగత మరుగుదొడ్లకు సకాలంలో నిధులు కేటాయించకపోవడంతో లబ్ధిదారులు అప్పులు చేసి కట్టించుకోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. చాల మందికి వ్యాధి సోకడం వలన వేలిముద్రలు పడక ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ మైనార్టీ నాయకులు ఆదాం సాహేబ్, జిల్లా స్టీరింగ్‌ కమిటీ సభ్యులు నందా బాలా. జిల్లా కార్యదర్శి వెంకట రెడ్డి, కోడూరు పట్టణ ఉప కన్వీనర్‌ రౌఫ్, స్థానిక వార్డు సభ్యులు ప్రకాష్, పార్టీ నాయకులు రెడ్డెయ్య, సుబ్బరామిరెడ్డి, అనిల్‌  తదితరులు పాల్గొన్నారు. 

Back to Top