నవరత్నాలతో వెలుగు

ఇందుకూరుపేట : వైయస్సార్‌ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాల పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు నిండుతాయని కో -ఆప్షన్‌ సభ్యుడు జలీల్, మహిళా నాయకురాలు దిల్షాద్‌ అన్నారు. మండలంలోని రావూరు గ్రామంలో బుధవారం నవరత్నాల కరపత్రాలను ఇంటింటికీ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల వాగ్దానాలను విస్మరించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. నాయకులు కొండయ్య, పద్మానాభం, భాస్కరయ్య తదితరులు పాల్గొన్నారు.
.....................................................................................
నవరత్నాల సభను జయప్రదం చేయండి
–ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి...
వెంకటాచలం: వెంకటాచలం మండలం చెముడుగుంట స్రిడ్స్‌ కళ్యాణ మండపంలో గురువారం ఉదయం 9.30కు సర్వేపల్లి నియోజకవర్గ వైయస్‌ఆర్‌సీపి నవర త్నాలసభ జరుగుతుందని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి తెలిపారు. ఈసభకు నియోజకవర్గ పరిదిలోని వెంకటాచలం, మనుబోలు, పొదలకూరు, ముత్తుకూరు, తోటపల్లిగూడూరు మండలాల్లోని వైఎస్‌ఆర్‌సీపి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు హాజరై జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
========================================

నవరత్నాలు సభకు తరలిన వైయస్సార్‌సీపీ శ్రేణులు 
కలువాయి: వెంకటగిరిలో బుధవారం జరిగిన నవరత్నాలు సభకు కలువాయి మండలం నుంచి వైయస్సార్‌సీపీ శ్రేణులు తరలివెళ్లాయి. పార్టీ మండల నాయకులు, జెడ్పీటీసీ సభ్యులు బులగాకుల అనిల్‌కుమార్‌ రెడ్డి నాయకత్వంలో పార్టీ నాయకులు, అనుబంధ విభాగాల ప్రతినిధులు, బూత్‌కమిటీ సభ్యులు పలు వాహనాల్లో తరలివెళ్లారు.

తాజా ఫోటోలు

Back to Top