టీడీపీకి బుద్ధి చెబుదాం

కర్నూలు: అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన తెలుగు దేశం పార్టీకి బుద్ధి చెబుదామని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రీశైలం నియోజకవర్గ సమన్వయకర్త బుడ్డా శేషారెడ్డి పిలుపునిచ్చారు. ఆత్మకూరు పట్టణంలోని 7వ వార్డులో శేషారెడ్డి గడప గడపకూ వైయస్‌ఆర్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు కాలనీవాసులు ఘన స్వాగతం పలికి తమ సమస్యలు ఏకరువు పెట్టారు. కాలనీలో తీవ్ర మంచినీటి ఎద్దడి నెలకొందని, నీటిని కొని తాగాల్సిన దుస్థితి నెలకొందన్నారు. అన్ని అర్హతలు ఉన్నా పింఛన్, రేషన్‌కార్డులు మంజూరు చేయడం లేదని వాపోయారు. ఇందుకు స్పందించిన బుడ్డా శేషారెడ్డి మాట్లాడుతూ..త్వరలోనే ప్రజా ప్రభుత్వం వస్తుందని, వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని ధైర్యం చెప్పారు. రాజన్న పాలన మళ్లీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు వెన్నా బోగిరెడ్డి, తిమ్మయ్య యాదవ్, సత్యరాజ్, సిద్దపల్లి కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Back to Top