వైయస్ జగన్ కు అండగా ఉందాం

చిట్టినగర్ః  ప్రతి ఒక్కరూ వైయస్సార్‌ కుటుంబంలో సభ్యులుగా చేరి జగన్‌కు అండగా ఉందామని వైయస్సార్‌ సీపీ నగర అధ్యక్షులు, పశ్చిమ ఇన్చార్జ్  వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. 31వ డివిజన్‌ అధ్యక్షులు కూరాకుల నాగ ఆధ్వర్యంలో శుక్రవారం కేఎల్‌రావునగర్‌లోని జంబులమ్మ గుడి వద్ద వైయస్సార్‌ కుటుంబం కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలుత వైయస్సార్‌ సీపీ జెండాను వెలంపల్లి శ్రీనివాసరావు, 35వ డివిజన్‌ కార్పొరేటర్‌ జమల పూర్ణమ్మ ఎగర వేశారు. జంబులమ్మ గుడి ప్రాంతంలో ఇంటింటికి వెళ్లి..... వైయస్సార్‌ సీపీ అధినేత వైయస్‌. జగన్మోహనరెడ్డి ప్రకటించిన నవరత్నాల వల్ల ప్రతి పేద వాడి కుటుంబంలోనూ సంతోషం వెల్లివిరియనుందని వెలంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. రానున్న రోజులలో జగన్‌కు అండగా ఉండి ఆదరించాలని ఆయన కోరారు. అధికార తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలతో కూడిన బ్యాలెట్‌ పేపర్‌ ఇచ్చి చంద్రబాబునాయుడికి ఎన్ని మార్కులు ఇస్తారో మీరే ఇవ్వాలంటూ ఆ పత్రాలను అందచేశారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు, యువకులు స్వచ్చందంగా వైయస్సార్‌ కుటుంబంలో తమ వివరాలను నమోదు చేసుకున్నారు. కార్యక్రమంలో 35వ కార్పొరేటర్‌ జమల పూర్ణమ్మ, యువజన విభాగం నగర అధ్యక్షులు కర్నాటి రాంబాబు, పార్టీ రాష్ట్ర సహాయ ∙కార్యదర్శి మైలవరపు దుర్గారావు, ప్రచార విభాగం నగర అధ్యక్షులు పోతిరెడ్డి సుబ్బారెడ్డి , లీగల్‌ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి బెవర ఉమామహేశ్వరరావు, 30వ డివిజన్‌ కన్వీనర్‌ వెన్నం రజనీకుమార్, దేరంగుల రమణ, కామళ్ల జోజి, కుంభా నాగేశ్వరరావు, కోరాడ సూరిబాబు, ఎస్‌. వెంకటేష్, కామళ్ల కిషోర్, కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top