అవినీతి పాలనకు చరమగీతం పాడుదాం

కర్నూలు))బనగానపల్లె నియోజకవర్గం ఇంచార్జ్ కాటసాని రామిరెడ్డి పెద్దరాజుపాలెం, పసుపలతండా ,కాలేనయాక్ తాండ, బద్రినాయక్ తాండ గ్రామాల్లో గడప గడప కు వైయస్సార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతు విభాగం అధ్యక్షుడు శివరామిరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  గడపగడపకు వెళ్లి బాబు మోసాలను ఎండగట్టారు. టీడీపీ అవినీతి, అక్రమ పాలనను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని బాబు అమలు చేయడం లేదని, తమను మోసం చేశాడని మండిపడ్డారు. అరాచక పాలనకు చరమగీతం పాడాలని కాటసాని ప్రజలకు పిలుపునిచ్చారు. 

Back to Top