దోపిడీ పాలనకు చరమగీతం పాడుదాం

టెక్కలి నియోజకవర్గo, సంతబొమ్మాలి మండలం , నగిరిపెంట గ్రామంలో నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ ఆధ్వర్యంలో గడగడపకు వైయస్ఆర్ కార్యక్రమం జరిగింది. పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి తిలక్ ఇంటింటికీ తెరిగి బాబు మోసపూరిత పాలనను వివరించారు. కరపత్రాలు అందించి ఎన్నికల హామీలపై మార్కులు వేయించారు. ఈ సందర్భంగా ప్రజలు బాబు పాలనపై దుమ్మెత్తిపోశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక తమకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందడం లేదని వారు వాపోయారు. దోపిడీ పాలనకు చరమగీతం పాడుదామని తిలక్ ప్రజలకు పిలుపునిచ్చారు. 


Back to Top