మోసకారి చంద్రబాబుకు ఎన్నికల్లో బుద్ధి చెబుతాం

విశాఖ(హుకుంపేట‌)) "టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత గిరిజ‌నుల సంక్షేమాన్ని గాలికి వ‌దిలేసింది, క‌నీస ప‌థ‌కాలు అందించ‌డంలేదు, ఇందిర‌మ్మ ఇళ్లు ర‌ద్దు చేయ‌డం అన్యాయం" అని ములియాపుట్టు పంచాయ‌తీ ప‌రిధిలోని కులుపాడు, దొర‌పేట గ్రామాల గిరిజ‌నులు వాపోయారు.  వైయ‌స్ఆర్ సీపీ అర‌కు నియోజ‌క వ‌ర్గ స‌మ‌న్వ‌య క‌మిటీ స‌భ్యులు పోయా రాజారావు, కె అరుణ‌కుమారి జ‌ర్సింగి సూర్య‌నారాయ‌ణ వ‌ద్ద గిరజనం తమ సమస్యలను విన్న‌వించారు. 65ఏళ్లు వ‌య‌సు పైబ‌డినా ఫించ‌న్లు మంజూరు చేయ‌లేద‌ని ఆవేదన వ్యక్తం చేశారు . గ‌తంలో నిర్మించుకున్న ఇందిర‌మ్మ ఇళ్ల బిల్లుల‌ను నిలిపివేసి ముఖ్య‌మంత్రి తీవ్ర అన్యాయం చేశార‌ని వాపోయారు. కార్య‌క్ర‌మంలో వైయ‌స్ఆర్ సీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.

తూర్పుగోదావరి(పి.గన్నవరం))ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయ‌కుండా మోస‌గిస్తున్న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఓటుతోనే త‌గిన బుద్ధి చెబుతామ‌ని బెల్లంపూడి గ్రామ‌స్తులు హెచ్చరించారు. వైయ‌స్ఆర్ సీపీ నాయ‌కులు కొండేటి చిట్టిబాబు ఆధ్వ‌ర్యంలో బెల్లంపూడిలో గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు వైయ‌స్ఆర్ సీపీ కార్య‌క్రమం నిర్వ‌హించారు. గ్రామ ప్ర‌జ‌లు ప‌లు స‌మ‌స్య‌ల‌ను పార్టీ నాయ‌కుల దృష్టికి తీసుకువ‌చ్చారు. చంద్ర‌బాబు డ్వాక్రా రుణాల‌ను పూర్తిగా మాఫీ చేస్తాన‌ని హామీ ఇచ్చి మోస‌గించ‌డం ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వ‌చ్చి రెండున్న‌రేళ్ల‌యినా ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయ‌లేద‌ని, పేద‌ల‌కు ఇళ్ల స్థ‌లాలు, అర్హుల‌కు పెన్ష‌న్లు, అంత్యోద‌య కార్డులు ఇవ్వ‌డం లేద‌ని, రోడ్లు నిర్మించ‌డం లేద‌ని ప‌లువురు వాపోయారు. కార్య‌క్ర‌మంలో వైయ‌స్ఆర్ సీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top