మన ప్రజానాయకుడు వైయస్ జగన్ ను గెలిపించుకుందాం

పత్తికొండ(తుగ్గలి): మోసపూరిత వాగ్ధానాలతో అన్ని వర్గాల ప్రజలను వంచించిన చంద్రబాబు చేతిలో మరోసారి మోసపోవద్దని వైయస్‌ఆర్‌సీపీ పత్తికొండ నియోజకవర్గ ఇన్‌చార్జి చెరుకులపాడు నారాయణరెడ్డి ప్రజలకు సూచించారు. గడపగడపకు వైయస్‌ఆర్‌ కార్యక్రమంలో భాగంగా తుగ్గలి మండలంలోని ముక్కెళ్ల గ్రామంలో ఇంటింటికీ వెళ్లి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించిన తీరును వివరించారు. ఈ సందర్భంగా స్థానికులు తాము అనుభవిస్తున్న కష్టాలను నారాయణరెడ్డికి వివరించారు. రుణమాఫీ చేస్తానన్న చంద్రబాబు మాటలు నమ్మి మోసమోయామని రైతులు, మహిళలు వాపోయారు. అనంతరం నారాయణరెడ్డి మాట్లాడుతూ... ప్రజల బాగోగుల గురించి ఆలోచించే ఏకైక నాయకుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని గెలిపించుకుందామని ప్రజలకు పిలుపునిచ్చారు. 


Back to Top