అవినీతి పాల‌న‌ను అంతం చేద్దాం

ప్ర‌కాశం:  రాష్ట్రంలో అవినీతి పాల‌న‌ను అంతం చేద్దామ‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ క‌నిగిరి నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త బుర్రా మ‌ధుసూద‌న్ యాద‌వ్ పిలుపునిచ్చారు. పామూరు మండలం ఇనిమేర్ల పంచాయతీలో బుధ‌వారం  గడప గడపకు వైయస్ఆర్ కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఇంటింటా ప‌ర్య‌టించి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు. ఏ ఇంటికి వెళ్లినా చంద్ర‌బాబు మోసాలు వెలుగు చూశాయి. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ..అబద్ధ‌పు హామీల‌తో గ‌ద్దెనెక్కిన చంద్ర‌బాబు ఏ ఒక్క సంక్షేమ ప‌థ‌కాన్ని కూడా స‌క్ర‌మంగా అమ‌లు చేయ‌లేక‌పోయార‌ని మండిప‌డ్డారు. సంక్షేమ ప‌థ‌కాలు ప‌చ్చ చొక్కాల‌కే ప‌రిమిత‌మ‌య్యాయ‌ని ధ్వ‌జ‌మెత్తారు. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ప్ర‌వేశ‌పెట్టిన సంక్షేమ ప‌థ‌కాల‌కు చంద్ర‌బాబు తూట్లు పొడుస్తున్నార‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి ఎక్క‌డ వేసిన గొంగ‌లి అక్క‌డే అన్న చందంగా మారింద‌ని ఫైర్ అయ్యారు. ఈ ప‌రిస్థితులు మారాలంటే వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ముఖ్య‌మంత్రి కావాల‌న్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీకి గుణ‌పాఠం చెబుతామ‌ని పిలుపునిచ్చారు. అనంత‌రం తమ్మనేనిపల్లి గ్రామంలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు రాచమల్ల తిరుపతిరెడ్డి కుమారుడు హరికృష్ణ రెడ్డి వివాహ వేడుకలో బుర్రా మధుసూదన్ యాదవ్ పాల్గొని నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించారు. 

తాజా ఫోటోలు

Back to Top