కనీస మౌళిక వసతులు కరువు

తీవ్ర అవస్థలు పడుతున్నాం
తూర్పుగోదావరి(మండపేట))గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మంలో భాగంగా మండపేట నియోజ‌క‌వ‌ర్గ కోఆర్డినేట‌ర్ వేగుళ్ల ప‌ట్టాభిరామ‌య్య చౌద‌రి రాయవరం మండ‌లంలోని పలు గ్రామాల్లో ప‌ర్య‌టించారు. పార్టీ రైతు విభాగం రాష్ట్ర కార్య‌ద‌ర్శి రెడ్డి రాధాకృష్ణ ఆధ్వ‌ర్యంలో స్థానికుల‌ స‌మ‌స్య‌ల‌డిగి తెలుసుకున్నారు. గ్రామంలో రోడ్లు, డ్రెయిన్లు త‌దిత‌ర మౌళిక వ‌స‌తుల లేక తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నామ‌ని ప్రజలు వాపోయారు. ప‌ట్టాభిరామ‌య్య మాట్లాడుతూ... రెండేళ్లు ఆగితే గ్రామంలోని అన్ని స‌మ‌స్య‌లు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నేతృత్వంలో ప‌రిష్క‌రిస్తామ‌ని హామీ ఇచ్చారు. కార్య‌క్ర‌మంలో వైయ‌స్ఆర్ సీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు. 

పథకాల అమలులో పక్షపాతం
విశాఖపట్నం(య‌ల‌మంచిలి)"మా గ్రామంలో ఇంత‌వ‌ర‌కు రోడ్లు లేవు, డ్రైనేజీ సౌక‌ర్యం లేదు" అంటూ పుల‌ప‌ర్తి గ్రామ‌స్తులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు వైయ‌స్ఆర్ సీపీ కార్య‌క్ర‌మంలో భాగంగా వైయ‌స్ఆర్ సీపీ యలమంచిలి స‌మ‌న్వ‌య‌క‌ర్త ప‌గ‌డ నాగేశ్వ‌ర‌రావు పుల‌ప‌ర్తిలో ప‌ర్య‌టించారు. ప్ర‌భుత్వ ప‌థ‌కాల అమ‌లులో నాయ‌కులు ప‌క్ష‌పాతం చూపుతున్నార‌ని గ్రామ‌స్తులు ఆరోపించారు. ప్ర‌గ‌డ మాట్లాడుతూ.. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్ర‌జ‌ల ఇబ్బందులు తీరిపోతాయ‌ని హామీ ఇచ్చారు. కార్య‌క్ర‌మంలో వైయ‌స్ఆర్ సీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.

అవినీతి పాలన
నెల్లూరు(సూళ్లూరుపేట‌))చంద్ర‌బాబు పాల‌నతో రాష్ట్రం అవినీతి రాజ్యంగా మారిందని సూళ్లూరుపేట వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్యే సంజీవయ్య  విమ‌ర్శించారు. చంద్ర‌బాబు మోసాల‌ను ఎండ‌గ‌డుతూ సాయినగర్ ఎస్టీ కాలనీలో గడప గడపకూ వైఎస్సార్‌ కార్యక్రమాన్నినిర్వహించారు. స్థానిక సమస్యలపై ప్రజలతో చర్చించి, ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు. 

Back to Top