`న‌వ‌ర‌త్నాలు`తోనే రాజ‌న్న రాజ్యం సాధ్యం

* ప్ర‌తి ఒక్క‌రికీ న‌వ ర‌త్నాల గురించి తెలియాలి
* వైయ‌స్ఆర్ కుటుంబంను విజ‌య‌వంతం చేయాలి
* క‌త్తెర హెని క్రిస్టిన
ఫిరంగిపురం: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్లీన‌రీ వేదిక‌గా ప్ర‌క‌టించిన `న‌వ‌ర‌త్నాలు` గురించి ప్ర‌తి ఒక్క‌రికీ తెలియ‌జేయాల‌ని,  న‌వ‌ర‌త్నాలుతోనే రాజ‌న్న రాజ్యం సాధ్య‌మ‌ని తాడికొండ నియోజ‌క‌వ‌ర్గం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి క‌త్తెర హెని క్రిస్టిన అన్నారు. ఫిరంగిపురంలోని మండల పార్టీ కార్యాలయంలో శ‌నివారం పార్టీ నాయకులు, బూత్‌ కమిటీ సభ్యులతో ప్రత్యేక స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా క్రిస్టినా మాట్లాడుతూ  ఈనెల 11 నుంచి అక్టోబర్‌ 2వతేదీ వరకు కొనసాగే వైయ‌స్ఆర్  కుటుంబం కార్య‌క్ర‌మాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత నాయకులు, బూత్‌ కమిటీ సభ్యులపై వుంటుందని స్పష్టం చేశారు. నియోజకవర్గం పార్టీ కన్వీనర్‌ కత్తెర సురేష్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రతి బూత్‌ కమిటీ సభ్యుడు గౌర్హాజ‌రు కాకుండా విధిగా కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పారు. అందరూ సమిష్టిగా గ్రామాల్లో పనిచేస్తూ ప్రతి కుటుంబంతో మమేకం కావాలని సూచించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్య‌క్షుడు సయ్యద్‌ హబీబుల్లా పార్టీ నాయకులు కొమ్మారెడ్డి చిన్నపరెడ్డి,సంపతి నాగరాజు, మున్నంగి సుదాకర్‌రెడ్డి,ఇజ్రాయేలు, బత్‌ కమిటీల సభ్యులు పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top