వైయ‌స్ఆర్‌ కుటుంబంలో చేరండి

నారాయణవనం: ప‌్ర‌తి ఒక్క‌రు వైయ‌స్ఆర్ కుటుంబంలో చేర‌వ‌చ్చు అని  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త ఆదిమూలం పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం మండల కేంద్రమైన నారాయనవనం, గోవిందప్పనాయుడు కండ్రిగ, తుంబూరులలో జరిగిన ఇంటింటా వైయస్సార్‌ కుటుంబ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పాలమంగళం ఉత్తరపు కండ్రిలో వైయస్సార్‌ కుటుంబం కార్యక్రమాన్ని సర్పంచ్‌ రేఖ, డిసిసిబి డైరెక్టర్‌ సాయిరవి, ఎంపిపి సుబ్బరాయశెట్టి, జడ్పీటీసీ ధర్మయ్యలు నిర్వహించారు. ఇంటింటా సభ్యుత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టి 9121091210 నెంబరుకు మిస్డ్‌ కాల్‌తో సభ్యుత్వ నమోదు చేయించారు. ఈ సందర్భంగా ఆదిమూలం మాట్లాడుతూ ఇంటి యజమానితో పాటు కుటుంబంలోని మేజర్లందరికీ సభ్యుత్వ నమోదు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో స్వచ్ఛందంగా అన్ని వర్గాల వారు ముందుకు రావడంతో నవరత్నాలను అమలు చేసే సత్తా జగన్‌మోహన్‌రెడ్డికి మాత్రమే ఉందన్న నమ్మకం ఏర్పడిందని అన్నారు. నారాయణవనంలోని ఆరో వార్డులో జరిగిన సభ్యుత్వ నమోదు కార్యక్రమంలో ఆదిమూలంతో పాటు పార్టీ మండల కన్వీనర్‌ సొరకాయలు, ఇన్‌చార్జి ఎంపిపి భక్తవత్సలం, నాయకులు శ్రీరాములురెడ్డి, గోపాల్, దిలీప్‌రెడ్డి, మోహన్, వెంకటేష్, బాలయ్య తదితరులు పాల్గొన్నారు. 
--------------------------- 

నవ రత్నాలతో అన్ని వర్గాల‌కు ల‌బ్ధి 
––తంబళ్ళపల్లి నియోజకవర్గ సమన్వయ కర్త పెద్దిరెడ్డి ద్వారకనాథ్‌రెడ్డి
పెద్దతిప్పసముద్రం:  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవ రత్నాలతో అన్ని వర్గాల ప్రజలకు ల‌బ్ధి చేకూరుతుంద‌ని తంబళ్ళపల్లి నియోజకవర్గ సమన్వయకర్త పెద్దిరెడ్డి ద్వారకనాథ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన పీటీఎంలో బూత్‌ కమిటి కన్వీనర్, సభ్యులతో కలసి ఇంటింటికి వెళ్ళి వైయ‌స్ఆర్‌  కుటుంబం కార్యక్రమంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ద్వారకనాథ్‌రెడ్డి మాట్లాడుతూ వైయ‌స్ఆర్‌  కుటుంబానికి ప్రతి ఒక్కరూ బాసటగా నిలవాలని ఆకాంక్షించారు. వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే నవరత్నాల అమలు చేసి పేదలకు న్యాయం చేస్తారన్నారు. మహిళా సంఘాలు అన్ని రంగాల్లో ఆర్థికవృద్ది సాధించాలంటే వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తోనే సాధ్యమన్నారు. వైయ‌స్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితే రాజన్న రాజ్యం వస్తుందన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చాకా అమలు చేయలేదని విమర్శించారు. నవ రత్నాల పథకాలైన వైఎస్సార్‌ రైతు భరోసా, వైఎస్సార్‌ ఆసరా, రూ.2 వేల నెలవారి పింఛన్, అమ్మ ఒడి, పేదవారికి ఇళ్ళు, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయంబర్స్‌మెంట్, జలయజ్నం, మధ్య నిషేదం లాంటి పథకాలను ప్రజలకు వివరించారు. బూత్‌ కమిటి కన్వీనర్లు నవ రత్నాల గురించి ఇంటింటికి వెళ్ళి వివరించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చంద్రబాబు పాలనలో కనుమరుగైన పథకాలు, ప్రజా వ్యతిరేక విధానాలకు వివరించారు. అనంతరం సెల్‌ నంబర్‌కు మిస్డ్‌ కాల్‌ చేయించి వైఎస్సార్‌ కుటుంబంలో సభ్యులుగా చేర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మహమూద్, రియాసత్‌ అలీఖాన్, తమక శంకర్, బావాజాన్, శ్రీనివాసులు, ధనలక్ష్మి, మల్లికార్జున, మహబూబ్‌బాషా, సందీప్, ఖాదర్‌వలి తదితరులు పాల్గొన్నారు. 
----------------------
ప్ర‌తి గ్రామంలో వైయ‌స్ఆర్‌ కుటుంబం
పులిచెర్ల(కల్లూరు)– ప్ర‌తి గ్రామంలోవైయ‌స్ఆర్‌ కుటుంబ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్నిచేపట్టాల‌ని ఎంపీపీ.మురళీధర్‌ తెలిపారు.
పులిచెర్ల మండలం కమ్మపల్లె పంచాయతి బండారువారి పల్లెలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైయ‌స్ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రకటించిన నవరత్నాలను గ్రామాల్లో విసృతంగా ప్రచారంచేయాలన్నారు. రాబోవు ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకితీసుకు రావడానికి ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేయాలనితెలిపారు.మండలంలోని మతుకువారిపల్లె, మంగళంపేటల్లోకూడా సభ్యత్వనమోదు
చేపట్టారు. కార్యక్రమంలో సర్పంచ్‌ రవీంద్రరెడ్డి,చంద్రశేఖరరెడ్డి,గోవిందరెడ్డి,ప్రతాప్‌రెడ్డి,రాయల్ మోహన్,బాబు,ముర్వత్‌భాషా,ఖాదర్‌వల్లి,హరున్‌ భాషా,కేశవరెడ్డి,గోవర్థన్,మురళి,లక్ష్మయ్యనాయుడు

తాజా ఫోటోలు

Back to Top