జన్మభూమి కమిటీలు అడ్డుకుంటున్నాయి

ప్రకాశంః సంక్షేమ పథకాలు తమకు అందకుండా జన్మభూమి కమిటీలు అడ్డుకుంటున్నాయని గ్రామస్తులు వాపోయారు. వైయస్సార్సీపీ పర్చురు నియోజకవర్గ ఇంఛార్జ్ గొట్టిపాటి భరత్ అన్నంబొట్లవారిపాలెంలో గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ అవినీతి పాలనను ఇంటింటికీ వెళ్లి ఎండగట్టారు.  ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలను మొరపెట్టుకున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక పథకాలన్నీ వాళ్ల పార్టీ నేతలకే కేటాయిస్తున్నారని, సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని గొట్టిపాటి భరత్ మండిపడ్డారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందాలంటే అది వైయస్సార్సీపీతోనే సాధ్యమని, రానున్న ఎన్నికల్లో పార్టీని ఆదరించాలని భరత్ ప్రజలను కోరారు.


Back to Top