జన్మభూమి కమిటీలు రాజ్యాంగ విరుద్ధం

నరసన్నపేట))రాష్ట్రంలో రాజ్యాంగానికి విరుద్ధంగా పాలన సాగుతోందని వైయస్సార్సీపీ రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడు ధర్మాన క్రిష్ణదాస్ మండిపడ్డారు. రాజ్యాంగాన్ని కాదని ప్రభుత్వం జన్మభూమి కమిటీలను నియమించడం సరికాదని,  పెత్తనం చెలాయిస్తూ ఇష్టారాజ్యంగా దోచుకుతింటున్నారని టీడీపీ నేతలపై నిప్పులు చెరిగారు. నరసన్నపేట మండలం కామేశ్వరిపేట గ్రామపంచాయతీ లో గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. పింఛన్లు ఇవ్వడం లేదని వికలాంగులు, వింతతువులు కృష్ణదాస్ కు మొరపెట్టుకున్నారు. రుణాలు మాఫీ కాలేదని, రోడ్లు, డ్రైనేజీలు దారుణంగా ఉన్నాయని మహిళలు వాపోయారు. మోసపూరిత సర్కార్ కు తగిన గుణపాఠం చెప్పాలని ధర్మాన పిలుపునిచ్చారు.


Back to Top