జన్మభూమి కమిటీల పెత్తనం..అర్హులకు అన్యాయం

చంద్రబాబు ఏకపక్ష పాలన
యలమంచిలి))చంద్రబాబు పాల‌న దారుణంగా ఉందని ఎం. జ‌గ‌న్నాథ‌పురం గ్రామ‌స్తులు మండిపడ్డారు. రైతురుణ మాఫీ, డ్వాక్రారుణ‌మాఫీ, హుద్ హుద్ తుపానులో ఇళ్ల‌కు న‌ష్ట‌ప‌రిహారం, పంట న‌ష్ట‌ప‌రిహారం, రేష‌న్ కార్డులు, ఫించ‌న్లు అన్నీ ప‌క్ష‌పాత ధోర‌ణితో మంజూరు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల‌ను గుప్పిట్లో ఉంచుకొని టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కే మంజూరు చేసుకుంటున్నార‌ని వాపోయారు. యలమంచిలి నియోజకవర్గ కన్వీనర్  ప్ర‌గ‌డ నాగేశ్వరరావు జగన్నాథ పురం గ్రామంలో గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ప్రగడ మాట్లాడుతూ.. జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు పెత్త‌నం క‌ట్ట‌బెట్టి చంద్ర‌బాబు ఏక‌ప‌క్ష‌పాల‌న చేస్తున్నార‌ని ప్రగడ విమర్శించారు. 

అర్హులకు అన్యాయం చేస్తున్నారు
కుప్పం))కుప్పం మండ‌లం తంబిగానిప‌ల్లి గ్రామంలో చేప‌ట్టిన గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు వైయ‌స్ఆర్ సీపీ కార్య‌క్ర‌మానికి విశేష స్పంద‌న ల‌భిస్తోంద‌ని కుప్పం నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్ చంద్ర‌మౌళి, కుప్పం మండ‌ల క‌న్వీన‌ర్ వెంక‌టేష్ బాబు తెలిపారు. ప్ర‌తి ఇంటికి వెళ్లి బాబు ఎన్నికల హామీలపై అభిప్రాయం సేక‌రించారు. ప్ర‌జ‌ల నుంచి పెద్ద ఎత్తున స‌మ‌స్య‌లు వెల్లువ‌లా వ‌చ్చాయి.  టీడీపీకి ఓట్లు వేయ‌నందుకు వివ‌క్ష చూపుతున్నార‌ని, ప్ర‌భుత్వ ప‌థ‌కాల్లో న్యాయం చేయ‌డం లేద‌ని పలువురు వైయస్సార్సీపీ నేతల దృష్టికి తీసుకువ‌చ్చారు. చంద్ర‌మౌళి మాట్లాడుతూ.. అర్హుల‌కు అన్యాయం చేయ‌డం త‌గ‌ద‌ని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్య‌క్ర‌మంలో వైయ‌స్ఆర్ సీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.

Back to Top