జన్మభూమి కమిటీల దౌర్జన్యం

బ‌ల‌హీన వ‌ర్గాల‌పై టీడీపీ నిర్ల‌క్ష్యం
రాజాం:  రాష్ట్రంలో బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల‌పై చంద్ర‌బాబు ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యం వ‌హిస్తోంద‌ని ఎమ్మెల్యే కంబాల జోగులు విమ‌ర్శించారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో భాగంగా ఆయ‌న రాజాం మండ‌ల ప‌రిధిలోని గ‌డిముడిదాం పంచాయ‌తీ సీఎస్ఆర్ పురంలో ప‌ర్య‌టించి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... ప్ర‌జ‌ల‌కు సంక్షేమ ప‌థ‌కాలు ద‌క్క‌కుండా జ‌న్మ‌భూమి క‌మిటీలు అడ్డుకుంటున్నాయ‌ని ధ్వ‌జమెత్తారు. క‌నీస వ‌స‌తులకు నోచుకోక ప్ర‌జ‌లు అల్లాడిపోతుంటే బాబు స‌ర్కార్ నిమ్మ‌కునీరెత్తిన‌ట్లు వ్య‌వ‌హారిస్తుంద‌ని మండిప‌డ్డారు. 

అవినీతి, అక్రమాలే లక్ష్యంగా టీడీపీ పనితీరు
పాల‌కొండ‌:  తాగ‌డానికి స్వ‌చ్ఛ‌మైన తాగునీరు లేదు... రెండుళ్లుగా కూలిన ఇళ్లు క‌ట్టుకునేందుకు దారిలేదు... వీధిలోకి వెళ్దామంటే మురికి కూపాలమ‌యం... రేష‌న్ రాదు... ఫించ‌న్ లేదు... ఇలా గ‌డ‌ప‌గ‌డ‌ప‌లోనూ స‌మ‌స్య‌లు వెలుగు చూస్తున్నాయి. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో భాగంగా ఎమ్మెల్యే విశ్వాస‌రాయి కళావ‌తి సింగ‌న్న‌వ‌ల‌స గ్రామంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ప్ర‌జ‌ల‌కు మౌళిక స‌దుపాయ‌ల‌ను క‌ల్పించ‌డంలో ప్ర‌భుత్వం పూర్తిస్థాయిలో విఫ‌ల‌మైంద‌ని ఆరోపించారు. అవినీతి, అక్ర‌మాలే ల‌క్ష్యంగా టీడీపీ ప‌నితీరు ఉంద‌ని విమ‌ర్శించారు. 

స‌మ‌స్య‌ల‌తో స‌హ‌వాసం
పాత‌ప‌ట్నం(మెళియాపుట్టి):  తాగేందుకు స్వ‌చ్ఛ‌మైన నీరులేదు... ఇళ్లు మంజూరు చేయ‌డం లేదు... ఫించ‌న్లు అంద‌డం లేదంటూ ప‌లువురు గిరిజ‌నులు వైయ‌స్సార్‌సీపీ శ్రీకాకుళం జిల్లా అధ్య‌క్షురాలు రెడ్డిశాంతి ఎదుట ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మండ‌ల ప‌రిధిలోని నంద‌వ‌కొత్తూరు, ప‌ర‌శురాంపురం, తోవూరు, నంద‌వ‌, రాయికోల‌, పెద్ద‌మ‌డికాల‌నీ గిరిజ‌న గ్రామాల్లో ఆమె గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా ఆమె వందప్ర‌శ్న‌ల‌తో కూడిన ప్ర‌జాబ్యాలెట్‌ను అంద‌జేసి, చంద్ర‌బాబు మోస‌పూరిత పాల‌న‌పై మార్కులు వేయించారు. అనంత‌రం రెడ్డిశాంతి మాట్లాడుతూ... 2019లో వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావ‌డం త‌థ్యమ‌న్నారు. 

Back to Top