వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది

బనగానపల్లె(కర్నూలు)

కొలిమిగుండ్ల మండలం మిర్జాపురం గ్రామంలో బనగానపల్లె నియోజకవర్గ ఇంచార్జ్ కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతీ గడపకు వెళ్లి బాబు మోసపూరిత హామీలను ఎండగట్టారు.  ఈ సందర్భంగా  కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ... తాను శాసనసభ్యునిగా ఉన్న సమయంలో గ్రామ అభివృద్ధి కోసం ఎంతో పాటు పడ్డానని చెప్పారు. ప్రజల  తాగునీటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని అవుకు రిజర్వాయర్ నుంచి రూ. 18 కోట్లతో ప్రతి పాదనలు పంపించి టెండర్లను కూడా పిలవడం జరిగిందన్నారు. అయితే సమైక్యాంధ్ర , తెలంగాణ ఉద్యమాలతో అధికారులు విధులకు హాజారు కాకపోవడంతో పనులు ఆలస్యం కావడం , తరువాతి ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడంతో ..ఆ పనులు మొదలు పెడితే తనకు ఎక్కడ మంచి పేరు  వస్తుందో అని టీడీపీ నేతలు నిర్లక్ష్యం చేస్తున్నారు అని మండిపడ్డారు.  ప్రజలు మళ్లీ తనను గెలిపిస్తే గ్రామాన్ని దత్తత తీసుకొని అన్ని విధాల అభివృద్ధి చేస్తాను అని హామీ ఇచ్చారు.  ఇవన్నీ నెరవేర్చాలంటే జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవలసిన సమయం ఆసన్నం అయిందని పిలుపునిచ్చారు.  కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధులు అంబటి ప్రసాద్ రెడ్డి ,సిద్దం రెడ్డి రామ్ మోహన్ రెడ్డి , మండల కన్వీనర్ రాజారెడ్డి , MPTC మెంబెర్ మల్లికార్జున ,బాల హుస్సాని నాయుడు , శ్రీరామ్ రెడ్డి ,రామసుబ్బారెడ్డి ,నరసింహ రెడ్డి , కంబయ్య ,నరసింహులు ,బిగల వెంకట సుబ్బయ్య,బేలుం హుస్సైనయ్య లు పాల్గొన్నారు.


Back to Top