రాష్ట్రాన్ని కేంద్రానికి తాకట్టు పెట్టారు

తూర్పుగోదావరి(మండపేట))కపిలేశ్వరపురం మండలం నేలటూరు  గ్రామంలో మండపేట వైయస్సార్సీపీ కో-ఆర్డినేటర్ వేగుళ్ల లీలాకృష్ణ ఆధ్వర్యంలో గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం కొనసాగింది. ఈసందర్భంగా  స్థానికులు తమ సమస్యలు తెలియచేసారు. చేనేత రుణాలు, రేషన్ కార్డులు, ఇళ్లస్థలాలు, రుణమాఫీ ఏ ఒక్క హామీని బాబు నెరవేర్చడం లేదని  ప్రభుత్వం  వైఫల్యాలను ప్రజలే వైయస్సార్సీపీ నేతల వద్ద విన్నవించారు. ఈ సందర్భంగా లీలాకృష్ణ మాట్లాడుతూ....చంద్రబాబు ఓటుకు నోటు కేసులో రాష్ట్రాన్నీ కేంద్రం ప్రభుత్వం దగ్గర తాకట్టు పెట్టారు అని విమర్శించారు. సర్కారు వైఫల్యాలఫై ముద్రించిన ప్రజాబ్యాలెట్ ను ఇంటింటికి పంపిణీచేశారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాజన్న పాలన త్వరలోనే  వస్తుందని ప్రజలకు భరోసా ఇచ్చారు.  ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు. 


Back to Top