వైయస్‌ఆర్‌ కుటుంబంలో చేరేందుకు ఆసక్తి

వైయస్‌ఆర్‌ జిల్లా: రాష్ట్ర ప్రజలంతా వైయస్‌ఆర్‌ కుటుంబంలో భాగస్వాములయ్యేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వైయస్‌ఆర్‌ కడప జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి అన్నారు. రాజంపేటలోని పాత బస్టాండ్‌ సెంటర్‌లో అమర్‌నాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో వైయస్‌ఆర్‌ కుటుంబం ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికీ తిరుగుతూ.. ప్రజలకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ ప్రకటించిన నవరత్నాల ప్రయోజనాలపై వివరించారు. కార్యక్రమంలో రాజంపేట పట్టణ అధ్యక్షుడు పోలా శ్రీనివాసుల రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Back to Top