వైయస్‌ఆర్‌ కుటుంబంలో చేరేందుకు ఆసక్తి

అనంతపురం: వైయస్‌ఆర్‌ కుటుంబంలో చేరేందుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ అన్నారు. సోమందేపల్లిలో శంకర్‌నారాయణ ఆధ్వర్యంలో వైయస్‌ఆర్‌ కుటుంబం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ వైయస్‌ఆర్‌ సీపీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల ప్రయోజనాలను వివరించారు. అనంతరం ప్రజలను వైయస్‌ఆర్‌ కుటుంబంలో భాగస్వాములను చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 
అదే విధంగా ఉరవకొండ నియోజకవర్గం బెలుగుప్పలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో వైయస్‌ఆర్‌ కుటుంబం కార్యక్రమం నిర్వహించారు.

తాజా ఫోటోలు

Back to Top