నిరుపేదలకు అన్యాయం

ఆలూరు))సంక్షేమ పథకాల అమలులో కూడ రాజకీయం చేస్తూ అధికార టీడీపీ నిరుపేదలకు తీరని అన్యాయం చేస్తోందని వైయస్సార్సీపీ ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మండిపడ్డారు. గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమంలో భాగంగా ఆయన ఎ. గోనేహాల్ గ్రామంలో పర్యటించారు. గడపగడపలో తెలుగుదేశం పార్టీ వైఫల్యాలను ఎండగట్టారు. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు విస్మరించి అన్ని వర్గాల ప్రజలను మోసం చేశాడని గడపగడపలో వివరించారు. ప్రజాసంక్షేమం కోసం ప్రభుత్వంపై తమ అధినేత వైయస్ జగన్ పోరాడుతున్నాని చెప్పారు. రానున్న రోజుల్లో వైయస్సార్సీపీని గెలిపించి, వైయస్ జగన్ ను సీఎం చేస్తే  రాజన్న పాలన అందిస్తారని చెప్పారు.


Back to Top