హామీలు అమ‌లు చేయ‌లేని అసమర్థ ప్ర‌భుత్వం

ప్ర‌కాశంః ఎన్నిక‌ల ముందు వంద‌ల కొద్ది హామీలిచ్చిన టీడీపీ అధికారంలోకి వ‌చ్చాక వాటిని అమ‌లు చేయ‌డంలో పూర్తిగా విఫ‌ల‌మైంద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌కాశం జిల్లా కొండేపి నియోజ‌క‌వ‌ర్గ నేత వ‌రికూటి అశోక్‌బాబు విమ‌ర్శించారు. నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని పొన్న‌లూరు మండ‌ల ప‌రిధిలోని కోట‌పాడు, బాలిరెడ్డిపాలెం, క‌ళ్లారువారిపాలెం గ్రామాల్లో గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఇంటింటికి తిరుగుతూ చంద్ర‌బాబు మోస‌పు హామీల‌పై ప్ర‌చురించిన ప్ర‌జాబ్యాలెట్‌ను స్థానిక ప్ర‌జ‌ల‌కు అందించారు. కార్య‌క్ర‌మంలో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పెద్ద సంఖ్య‌లో పాల్గొన్నారు.


Back to Top