గడపగడపలో ప్రజా సమ్యలు తెలుసుకొంటూ

మదనపల్లె: ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేసేందుకు ప్రతి గడపతొక్కుతూ... ప్రజా సమస్యలు తెలుసుకొంటూ...మదనపల్లె ఎమ్మెల్యే డాక్టర్‌ దేశాయ్‌ తిప్పారెడ్డి ముందుకు వెళ్తున్నారు. వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘గడపగడపకూ వైయస్సార్‌సీపీ’ కార్యక్రమం నియోజకవర్గంలోని రామసముద్రం, నిమ్మనపల్లి, మదనపల్లె రూరల్‌ మండలాలతో పాటు మున్సిపాలిటీలో విస్తృతంగా జరుగుతోంది. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే డాక్టర్‌ దేశాయ్‌ తిప్పారెడ్డి.. పార్టీ ప్రజాప్రతినిథులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచారాన్ని మరిపించేలా కార్యక్రమం జరుగుతుండటంతో ప్రజలు కూడా తమ సమ్యలు తెలిపేందుకు ముందుకు వస్తున్నారు. వందరోజుల పాటు కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించారు.

ఏగడపలో చూసినా అనేక సమస్యలు, ఆవేదనలు, నిరాశ నిస్పృహలు కనిపించాయి. రాజన్న రాజ్యం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నామని ప్రజలు చెప్పిన మాటలకు ఎమ్మెల్యే సంతోషించారు. వందరోజుల కార్యక్రమంపై ఎమ్మెల్యే మాట్లాడుతూ..మోసపూరిత వాగ్ధానాలతో గద్దెనెక్కిన టిడిపి ప్రభుత్వం ఎపుడు కూలుతుందోనని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నా వాటిని పరిష్కరించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. కనీసం ఎమ్మెల్యేలకు నిధులు మంజూరు చేయకుండా పాలన సాగించడం దారుణమైన విషయమన్నారు.  ప్రస్తుత ప్రభుత్వ హయాంలో మహిళలు, రైతులు, కార్మికులు, కర్షకులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎన్నికలు ఎపుడు వస్తాయా, బాబుకు ఎప్పుడు బుద్ధి చెబుదామా అని ప్రతీ ఒక్కరూ ఎదురుచూస్తున్నారని చెప్పారు. 


 
Back to Top