నా జీవితంలో ఇక టీడీపీకి ఓటు వేయను

నేను డిగ్రీ చదివాను.  ఉద్యోగం లేదు... నిరుద్యోగ భృతి లేదు...ఇది ఓ నిరుద్యోగి ఆవేదన.  నా పేరు స‌త్త‌య్య నాకు ఎక‌రా పోలంపై రూ. 56వేల రుణామాఫీ చెల్లించాల్సి ఉంది.,, ఇప్ప‌టికీ నాకు రుణ‌మాఫీ కాలేదు. ఇది ఆ రైతు ఆవేదన.  ఎన్నిక‌ల్లో డ్వాక్రా రుణమాఫీ చేస్తాన‌న్న బాబు ఇప్ప‌టికి డ్వాక్రా రుణాలు మాఫీ చేయ‌లేదు.  టీడీపీ వాళ్లు ఓటు వేయ‌మ‌ని నా ఇంటివైపు వ‌స్తే ముఖంపైనే త‌ల‌పులు వేస్తేస్తా... నా జీవితంలో ఇక టీడీపీకి ఓటు వేయ‌ను ఇది ఓ ఇల్లాలి ఆవేద‌న‌... అర్హత ఉన్నా పింఛను రావడంలేదు ఇది ఓ ముస‌లమ్మ ఆక్రంద‌న‌... ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇప్పుడు ఏ ఇంటికి వెళ్లినా... ఏ గ‌డ‌ప‌తొక్కినా... ఇలాంటి మాట‌లే వినిపిస్తున్నాయి. ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు ఇచ్చిన హామీల్లో ఒక్క‌టి కూడా నేర‌వేర్చ‌లేదు. జీవితంలో టీడీపీకి ఓటు వేయ‌ను అని ప్ర‌జ‌లు త‌మ ఆక్రంద‌న‌ను వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కుల‌తో చెబుతున్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో బాబు ఇచ్చిన హామీల‌పై వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ వంద ప్ర‌శ్న‌ల‌తో కూడిన ప్ర‌జాబ్యాలెట్‌తో గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ పేరుతో ప్ర‌జ‌ల ముందుకు వెళ్తున్నారు. ఈ ప్ర‌జాబ్యాలెట్ లో బాబుకు వంద‌కు ఒక్క మార్కు కూడా రావ‌డం లేదు. 

Back to Top