వైయ‌స్ఆర్ కుటుంబానికి ప్ర‌జాద‌ర‌ణ‌

గడివేముల:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పిలుపు మేర‌కు మండ‌లంలో చేప‌డుతున్న వైయ‌స్ఆర్ కుటుంబానికి విశేష ప్ర‌జాద‌ర‌ణ ల‌భిస్తోంది. బుధ‌వారం మండల పరిధిలోని గని గ్రామంలో వైయస్‌ఆర్ కుటుంబం కార్యక్రమం నిర్వ‌హించారు.  వైయస్‌ఆర్ సీపీ గ్రామ నాయకుడు ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో  దాదాపు 40 కుటుంబాల వారిని బూత్ క‌మిటీ స‌భ్యులు కలిసి టిడిపి ప్రభుత్వ వైఫల్యాలను వివరించి వారికి కష్టనష్టాలను తెలుసుకున్నారు. రాబోయే రోజుల్లో తప్పని సరిగా వైయస్‌ఆర్‌ ప్రభుత్వం ఏర్పడుతుంద‌ని, వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కాగానే ప్ర‌జ‌ల క‌ష్టాలు తొల‌గిపోతాయ‌ని భ‌రోసా క‌ల్పించారు. కార్యక్రమంలో బాకర్‌సాహెబ్, నూర్‌అహమ్మద్, వెంకటరమణ, కిరణ్‌కుమార్‌శెట్టి, సూర్యప్రకాస్‌రెడ్డి, పరమేశ్వరరెడ్డి, కొమ్ముసుధాకర్, గౌండనబిరసూల్‌ తదితరులు పాల్గొన్నారు.
------------------------------- 
నవరత్నాల పథకాల‌తో పేదలకు లబ్ధి 
శ్రీ‌శైలం: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌క‌టించిన న‌వ‌ర‌త్నాల ప‌థ‌కాల‌తో పేద‌ల‌కు ల‌బ్ధి చేకూరుతుంద‌ని పార్టీ నాయ‌కులు,  వార్డు కన్వీనరు గిరిజాశంకరస్వామి, నాగ‌మ‌ల్లికార్జున‌, బాలు నాయ‌క్ అన్నారు. బుధ‌వారం శ్రీశైల దేవస్థానం పరిధిలోని ఘంటామఠం, ఏనుగు చెరువుకట్ట ప్రాంతాలలో వైయ‌స్ఆర్ కుటుంబం కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా వైయ‌స్ జ‌గ‌న్  ప్రకటించిన నవరత్నాలు పథకాలను ప్రజలకు వివరిస్తూ పేద ప్రజలకు ఎలాంటి లబ్ధి చేకూర్చుతుందన్న విషయాలను తెలియజేశారు.   కార్యక్రమంలో కార్యకర్తలు శివరామ్, గోపాలు, వెంకటయ్య,చరణ్, నాగేశ్వరరావు, ప్రదీప్‌ కల్యాణ్, తదితరులు పాల్గొన్నారు. 
---------------------

వైయ‌స్ఆర్‌ కుటుంబానికి విశేష స్పంద‌న 
ప్యాపిలి: మండల పరిధిలోని ఏనుగుమర్రి గ్రామంలో బుధవారం నిర్వహించిన వైయ‌స్ఆర్‌ కుటుంబం కార్యక్రమానికి విశేష స్పంద‌న ల‌భించింది. పార్టీ గ్రామ నాయకులు అరిగెల రామాంజనేయులు, కరణం మదన్‌మెహన్, లక్ష్మీకాంతరెడ్డి ఆధ్వర్యంలో బూత్ క‌మిటీ స‌భ్యులు ఇంటింటా ప‌ర్య‌టించారు. వైయ‌స్ జగనన్న అధికారంలోకి రాగానే నవరత్నాల పేరిట సంక్షేమ పథకాలను అమలు చేస్తారని వారు తెలిపారు. తెలుగుదేశం పార్టీకి రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రజలు స్వచ్ఛందంగా టోల్‌ఫ్రీ నంబర్‌కు మిస్స్‌డ్‌ కాల్‌ ఇచ్చి వైఎస్సార్‌ కుటుంబంలో చేరారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ శేషన్న, పోలీసు వెంకటరాముడు, శ్రీనివాసులు, శివ, అరిగెల చిన్న రామాంజి, మద్దిలేటి, వెంకటరాముడు, శ్రీనివాసులు గౌడ్, బోయ బాలు, అరిగెల మహేశ్, అరిగెల మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.
------------------------ 
ప్ర‌తి ఇంటికి న‌వ‌ర‌త్నాలు 
కొలిమిగుండ్ల: వైయ‌స్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌స్తే ప్ర‌తి ఇంటికి న‌వ‌ర‌త్నాలు అందుతాయ‌ని పార్టీ మండ‌ల నాయ‌కులు ప్ర‌చారం చేశారు. బుధ‌వారం ప‌లు గ్రామాల్లో బూత్‌ కన్వీనర్లు, సభ్యులు వైయ‌స్ఆర్ కుటుంబం కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు.. టీడీపీ పాలనతో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వైయ‌స్‌ఆర్‌సీపీ అధికారంలోకి వస్తే అందరకి సమన్యాయం చూకూరుతుందని పార్టీ శ్రేణులు పేర్కొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top