గడపగడపలో విశేష ఆదరణ

వైయస్సార్సీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా విశేష ఆదరణ లభిస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు విస్మరించి రాష్ట్రాన్ని నిలువు దోపిడీ చేస్తున్న చంద్రబాబు దురాగతాలను వైయస్సార్సీపీ శ్రేణులు గడపగడపలో ఎండగడుతున్నారు. 


కర్నూలు జిల్లా బనగానపల్లె నియోజకవర్గం ఇంఛార్జ్ కాటసాని రామిరెడ్డి కోవెలకుంట్ల మండలం పెద్ద కొప్పెర్ల, గోవిందిన్నె గ్రామాల్లో గడపగడపకూ వైయస్సార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మరోవైపు, పత్తికొండ నియోజకవర్గ ఇంఛార్జ్ సి.హెచ్ నారాయణరెడ్డి జొన్నగిరి గ్రామంలో ప్రతీ గడపలో పర్యటించారు. చంద్రబాబు  మోసాలను ప్రతి ఇంటికీ వెళ్లి వివరించారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ... చంద్రబాబు ముఖ్య మంత్రి అయితే వర్షాలు పడవని మరోసారి నిరూపించుకున్నాడన్నారు. మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమ సస్య శ్యామలంగా ఉండేదన్నారు. మళ్లీ రాజన్న రాజ్యం రావాలంటే వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావాలన్నారు. అప్పుడే ప్రజల కష్టాలు తీరుతాయని చెప్పారు. 


నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి , పార్టీ నేత ఆనం విజయకుమార్ రెడ్డి తదితరులు భుజభుజ నెల్లూరులో గడపగడపకూ వైయస్సార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. 33వ డివిజన్ కార్పొరేటర్ సత్తార్, 34వ డివిజన్ ఇంచార్జ్ హజరత్ కోటంరెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికీ వెళ్లి బాబు మోసాలను వివరించారు. ఎన్నికల హామీలకు సంబంధించి ప్రతీ గడపలో కరపత్రాలు అందించి ప్రజల నుంచి సమాధానం రాబట్టారు. అబద్ధపు హామీలిచ్చి మోసం చేసిన బాబుకు ప్రజలు సున్నాతో చుట్టేశారు.Back to Top