గడపగడపలో ప్రజల పార్టీకి బ్రహ్మరథం

రాష్ట్రవ్యాప్తంగా గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతోంది. వంద రోజులు పూర్తి చేసుకొని విజయవంతంగా ముందుకు సాగుతోంది. గడపగడపలో వైయస్సార్సీపీ శ్రేణులకు ప్రజలు ఘనస్వాగతం పలుకుతున్నారు. టీడీపీ పాలనలో దగాపడిన ప్రజలకు వైయస్సార్సీపీ నాయకులు కొండంత అండగా నిలుస్తున్నారు. వారి సమస్యలు తెలుసుకుంటూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. మోసపూరిత వాగ్ధానాలతో గద్దెనెక్కిన చంద్రబాబు సర్కార్ పై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, నెలకు రూ.వేల నిరుద్యోగ భృతి, ఇళ్లు, పింఛన్లు ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ప్రజలను బాబు నట్టేట ముంచాడు. రెండున్నరేళ్లుగా ప్రజలను వంచిస్తూ మభ్యపెడుతూ కాలం వెళ్లబుచ్చుతున్నాడు. బాబు పాలనపై విసిగివేసారిన ప్రజలు టీడీపీకి తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. మహానేత వైయస్సార్ స్వర్ణయుగం మళ్లీ రావాలంటే అది వైయస్ జగన్ తోనే సాధ్యమని విశ్వసిస్తున్నారు. 2019లో వైయస్సార్సీపీని గెలిపించుకుంటామని స్పష్టం చేస్తున్నారు. తమ జీవితాలు బాగుపడాలంటే వైయస్ జగన్ సీఎం కావాలని కోరుకుంటున్నారు.  

Back to Top