గ‌డ‌ప గ‌డ‌పలో విశేష స్పంద‌న‌

అనంత‌పురంః వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేప‌డుతున్న గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మానికి ప్ర‌జ‌ల నుంచి విశేష స్పంద‌న ల‌భిస్తోంద‌ని అనంత‌పురం జిల్లా క‌ళ్యాణ‌దుర్గం నియోజ‌క‌వ‌ర్గ పార్టీ స‌మ‌న్వ‌య‌క‌ర్త ఉషాశ్రీ‌చ‌ర‌ణ్ తెలిపారు. నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని ఇప్పార్స‌ప‌ల్లి, గుల్యం గ్రామ పంచాయ‌తీల ప‌రిధిలో గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఉషాశ్రీ‌చ‌ర‌ణ్ ఇంటింటికి తిరుగుతూ చంద్ర‌బాబు ప‌రిపాల‌న తీరుపై ఆరా తీశారు. బాబు పాల‌న‌తో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామ‌ని ప్ర‌జ‌లంతా ముక్త‌కంఠంతో చెబుతున్నార‌న్నారు. ఎన్నిక‌ల ముందు ఇచ్చిన హామీలు అమ‌లు చేయ‌కుండా ప్ర‌జ‌ల‌ను న‌ట్టేట ముంచార‌ని ఉషాశ్రీచరణ్ చంద్రబాబుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రానున్న ఎన్నిక‌ల్లో వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని ముఖ్య‌మంత్రిని చేసుకుంటే ప్ర‌జ‌లు సంతోషంగా జీవించ‌వ‌చ్చునన్నారు. కార్య‌క్ర‌మంలో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పెద్ద సంఖ్య‌లో పాల్గొన్నారు.


Back to Top