గడపగడపలో ప్రజల పార్టీకి విశేష ఆదరణ

శ్రీకాకుళంః  వైయస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాద రావు శ్రీకాకుళం నియోజకవర్గంలో గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం నిర్వహించారు. తమ గోడు వినేందుకు వచ్చిన వైయస్సార్సీపీ నేతలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ధర్మాన ఇంటింటికీ తిరుగుతూ బాబు మోసపూరిత విధానాలను ఎండగట్టారు. అదే సమయంలో వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చని చంద్రబాబుపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 


Back to Top